డీఎస్సీ ఫలితాలను ప్రకటించేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలను స్వీకరించే గడువు కూడా ఆగస్టు 20వ తేదీతో పూర్తి అయింది. అయితే అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు భారీగా వచ్చాయి. వీటిని త్వరితగతిన పరిశీలించి… ఫైనల్ కీని ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది.