Home ఎంటర్టైన్మెంట్ Shraddha Kapoor: ప్రధాని మోడీని ఇన్‌స్టా ఫాలోయర్లలో దాటేసిన శ్రద్ధా కపూర్, నెక్ట్స్ టార్గెట్...

Shraddha Kapoor: ప్రధాని మోడీని ఇన్‌స్టా ఫాలోయర్లలో దాటేసిన శ్రద్ధా కపూర్, నెక్ట్స్ టార్గెట్ ప్రియాంక చోప్రా

0

PM Modi Instagram followers: భారత ప్రధాని నరేంద్ర మోడీని ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ దాటేశారు. నరేంద్ర మోడీని ఇన్‌స్టాలో ప్రస్తుతం 91.3 మిలియన్ మంది ఫాలో అవుతుండగా, 91.4 మిలియన్ల ఫాలోయర్లతో శ్రద్ధ కపూర్ అధిగమించారు. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న 37 ఏళ్ల శ్రద్ధా కపూర్ ఇటీవల నటించిన హారర్ కామెడీ మూవీ “స్త్రీ 2” ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తర్వాత మెటా‌కి చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలెబ్రిటీగా శ్రద్ధాకపూర్ నిలిచారు. ఇన్‌స్టాలో కొంచెం తక్కువ మంది ఫాలోయర్లు ఉన్నప్పటికీ ఎక్స్ (ట్విట్టర్‌)లో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ 101.2 మిలియన్ల ఫాలోయర్లతో గ్లోబల్ లీడర్‌గా కొనసాగుతున్నారు.

Exit mobile version