కాకరకాయ తినడం వల్ల అందరికీ ప్రయోజనం ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లు కాకరకాయ తింటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు, ఊబకాయంతో బాధపడుతున్న వారు, పొట్ట సమస్యలు, అజీర్ణం, పొట్టలో మంట వంటి సమస్యలతో బాధపడేవారు కాకరకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి. కాకరకాయలో ఉండే క్యాటెచిన్, గల్లిక్ యాసిడ్, క్లోరోజనిక్ యాసిడ్… ఇవన్నీ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి మన శరీరాన్ని పటిష్టంగా మారుస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు లేనివారు కూడా కాకరకాయను వారంలో కనీసం రెండు నుంచి మూడుసార్లు తినాల్సిన అవసరం ఉంది.