Allu Arjun – David Warner: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు చాలా ఇష్టం. అల్లు అర్జున్ పాటలు, డైలాగ్‍లను అనుకరిస్తూ సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు వార్నర్. అలవైకుంఠపురములో మూవీలోని బుట్టబొమ్మ నుంచి పుష్పలోని పాటలు, డైలాగ్‍లతో చాలా వీడియోలు చేశారు. ఐపీఎల్‍లో గతంలో సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆడటంతో తెలుగు సినిమాలకు వార్నర్ బాగా అలవాటు పడ్డారు. అలాగే, మైదానంలో చాలాసార్లు తగ్గేదెలే, శ్రీవల్లీ సాంగ్ హుక్ స్టెప్ సిగ్నేచర్ మూమెంట్స్ చేసి అభిమానులను అలరించారు. అయితే, తాజాగా ఓ యాడ్‍లో పుష్పలో లాంటి డైలాగ్ చెప్పారు వార్నర్. దీని అల్లు అర్జున్ కామెంట్ చేశారు.