రక్షణ కల్పించండి
పిల్లలు బయటికి వెళ్లేటప్పుడు, స్కూలుకు వెళ్తుంటే గొడుగులు, రెయిన్కోట్లు, రెయిన్బూట్లను ఉపయోగించండి. ఇది మీ పిల్లలను సురక్షితంగా ఉంచుతుంది. వర్షాకాలంలో రోజూ కురుస్తున్న వర్షం వల్ల చలి వాతావరణం ఏర్పడుతుంది. పిల్లలు వెచ్చగా ఉండాలంటే వీలైనంత వరకు కాటన్ దుస్తులు, జాకెట్లు ధరించండి. అలాగే శిశువు బట్టలు పూర్తిగా ఆరిపోయినప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే, వర్షాకాలంలో బట్టలు తేమను పీల్చుకుంటాయి. ఇది ఫంగల్ వ్యాధులకు కారణమవుతుంది.