posted on Jun 11, 2024 11:57AM
ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా తనను ఎన్నుకున్నందుకు చంద్రబాబు సభ్యులకు కృతజ్ణతలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ధృఢ సంకల్పంతో ప్రజలు చొరవ చూపి కూటమికి అఖండ విజయాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు. ప్రజాతీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు అన్నారు. అత్యున్నత ఆశయాల కోసం మూడు పార్టీలూ ఏకమయ్యాయన్నారు. ఈ విజయంలో పవన్ కల్యాణ్ కృషిని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు.
జనసేన అధినేత ఈ ఎన్నికలలో వంద శాతం ఫలితాలు సాధించారని చెప్పరు. 21 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసిన జనసేన ఆ 21 స్థానాలలోనూ విజయం సాధించిందని చెప్పారు. అసెంబ్లీలో విపక్ష హోదా కూడా దక్కనంత ఘోరమైన ఓటమిని జనం వైసీపీకి ఇచ్చారని చెప్పిన చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలకు వేదికగా ఏపీ అసెంబ్లీ నిలవాలని ఆకాంక్షించారు.