Home ఆంధ్రప్రదేశ్ Kurnool TDP Leader Murder : వేటకొడవళ్లతో దాడి, కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య-...

Kurnool TDP Leader Murder : వేటకొడవళ్లతో దాడి, కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ఫ్యాక్షన్ దాడులపై లోకేశ్ సీరియస్

0

గ్రామంలో ఉద్రిక్తత

మృతుడు గిరినాథ్‌కు భార్య భార్గవి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గిరినాథ్ హత్యకు కారణం వైసీపీ నేత‌లు రామ‌కృష్ణ, ర‌మేష్‌, చిన్నపామ‌య్య, మ‌ధుసూద‌న్ రెడ్డి, చ‌క్రపాణిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప‌ద్మనాభ‌రెడ్డి, తేజేశ్వర్ రెడ్డి, చైత‌న్యరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీ‌దేవి, కంగాటి రామ్మోహ‌న్ రెడ్డితో పాటు మ‌రి కొంద‌రు ఉన్నార‌ని గిరినాథ్ తండ్రి రామాంజ‌నేయులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ హ‌త్య అనంతరం గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెల‌కొంది. వైసీపీ నేత‌ల‌కు చెందిన రెండు గ‌డ్డివాములు, ద్విచ‌క్ర వాహ‌నాన్ని టీడీపీ వ‌ర్గీయులు కాల్చివేశారు. విష‌యం తెలుసుకున్న సీఐ సురేష్ కుమార్ రెడ్డి, ఎస్ఐ పి.చంద్రశేఖ‌ర్ రెడ్డి బొమ్మిరెడ్డిప‌ల్లి గ్రామానికి చేరుకొని ఘ‌ట‌న స్థలాన్ని ప‌రిశీలించారు. హ‌త్యకు పాల్పడిన వారి వివ‌రాలు సేక‌రించి, వారిపై కేసు న‌మోదు చేశారు. అలాగే ఎస్పీ జి.కృష్ణకాంత్ కూడా గ్రామాన్ని సంద‌ర్శించారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తత‌లు తావివ్వకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. నిందితులు ప‌రారీలు ఉన్నట్లు తెలిసింది.

Exit mobile version