Saturday, October 26, 2024

కేంద్ర మంత్రులు.. శాఖలు.. పూర్తి వివరాలు ఇవిగో! | central ministers portfolios| central ministers

కేంద్ర మంత్రివర్గంలో మంత్రులకు శాఖలను ప్రకటించారు. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ క్యాబినెట్ మంత్రిత్వశాఖ లభించింది. అలాగే గుంటూరు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌కి సహాయ మంత్రిగా గ్రామీణాభివృద్ధి, కమ్యునికేషన్స్ శాఖలు లభించాయి. నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకి భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి హోదా లభించింది. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ క్యాబినెట్ మంత్రి హోదా, బండి సంజయ్ కుమార్‌కి హోంశాఖ సహాయ మంత్రి హోదా దక్కాయి.

కేంద్ర మంత్రివర్గ సమగ్ర స్వరూపాన్ని పరిశీలిస్తే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవితోపాటు మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, డిపార్ట్.మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ, డిపార్ట్.మెంట్ ఆఫ్ స్పేస్, ఆల్ ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్, ఇతరులకు కేటాయించిన అన్ని శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తారు.

క్యాబినెట్ మంత్రులు – శాఖలు

1. రాజ్‌నాథ్ సింగ్ (రక్షణ శాఖ), 2, అమిత్ షా (హోమ్ అఫైర్స్, సహకార శాఖ), 3. నితిన్ జైరామ్ గడ్కరీ (రోడ్ ట్రాన్స్.పోర్ట్, హైవేస్), 4. జె.పి.నడ్డా (హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్), 5. శివరాజ్ సింగ్ చౌహాన్ (వ్యవసాయ శాఖ, రౌతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి), 6. నిర్మలా సీతారామన్ (ఫైనాన్స్, కార్పొరేట్ ఎఫైర్స్), 7. సుబ్రహ్మణ్యం జయశంకర్ (విదేశీ వ్యవహారాలు), 8. మనోహర్ లాల్ (హౌసింగ్, పట్టణ వ్యవహారాలు, పవర్), 9. హెచ్.డి.కుమారస్వామి (భారీ పరిశ్రమలు, ఉక్కు), 10. పీయూష్ గోయెల్ (కామర్స్, ఇండస్ట్రీ), 11. ధర్మేంద్ర ప్రధాన్ (విద్యాశాఖ), 12. జితన్ రామ్ మాంఝీ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్), 13. రాజీవ్ రతన్ సింగ్ (పంచాయితీరాజ్, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డైరీ), 14. సర్బానంద సోనేవాల్ (పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్), 15. వీరేంద్రకుమార్ (సోషల్ జస్టిస్, ఎంపవర్‌మెంట్), 16. కంజరాపు రామ్మోహన్ నాయుడు (పౌర విమానయానం), 17. ప్రహ్లాద్ జోషి (వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, న్యూ అండ్ రినవబుల్ ఎనర్జీ), 18. జువాల్ ఓరమ్ (గిరిజన సంక్షేమం), 19. గిరిరాజ్ సింగ్ (టెక్స్.టైల్స్), 20. అశ్విని వైష్ణవ్ (రైల్వేస్, సమాచార ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), 21. జ్యోతిరాదిత్య సింధియా (కమ్యునికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి), 22. భూపేందర్ యాదవ్ (పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు), 23. గజేంద్ర సింగ్ షెకావత్ (సాంస్కృతిక, పర్యాటక), 24. అన్నపూర్ణా దేవి (మహిళ, శిశు సంక్షేమం), 25. కిరెన్ రిజిజు (పార్లమెంట్ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు), 26. హర్దీప్ సింగ్ పూరి (పెట్రోలియం, నేచురల్ గ్యాస్), 27. మన్సుఖ్ మాండవీయా (కార్మిక, ఉపాధి, యువజన సర్వీసులు, క్రీడలు), 28. జి.కిషన్ రెడ్డి (బొగ్గు, గనులు), 29. చిరాగ్ పాశ్వాన్ (ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు), 30. సి.ఆర్.పాటిల్ (జలశక్తి).

సహాయ మంత్రులు (ఇండిపెండెంట్ ఛార్జ్)

1. రావ్ ఇంద్రజీత్ సింగ్ (గణాంకాలు, ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్, ప్లానింగ్, కల్చర్), 2. జితేంద్ర సింగ్ (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్, ఆటమిక్ ఎనర్జీ, స్పేస్), 3. అర్జున్ రామ్ మేఘవాల్ (లా అండ్ జస్టిస్, పార్లమెంటరీ ఎఫెర్స్), 4. జాదవ్ ప్రతాప్ రావ్ గణ్‌పత్ రావ్ (ఆయుష్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం), 5. జయంత్ చౌదరి (స్కి్ల్ డెవలప్‌మెంట్, ఎంట్రప్రిన్యూర్‌షిప్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్), 

సహాయ మంత్రులు

1. జితిన్ ప్రసాద (కామర్స్, ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), 2. శ్రీపాద్ ఎస్సో నాయక్ (పవర్, న్యూ, రినవబుల్ ఎనర్జీ), 3. పంకజ్ చౌదరి (ఫైనాన్స్), 4. కిషన్ పాల్ (సహకారశాఖ), 5. రామ్‌దాస్ అథవాలే (సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్), 6. రామ్‌నాథ్ ఠాకూర్ (వ్యవసాయం, రైతు సంక్షేమం),7. నిత్యానంద్ రాయ్ (హోమ్ ఎఫైర్స్), 8. అనుప్రియా పటేల్ (ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలు, కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్), 9. వి.సోమన్న (జలశక్తి, రైల్వేస్), 10. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (గ్రామీణాభివృద్ధి, కమ్యునికేషన్లు), 11. ఎస్.పి.సింగ్ బఘేల్ (ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, పంచాయితీరాజ్), 12. శోభా కరాందలాజి (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌‌ప్రైజెస్, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్), 13. క్రితవర్ధన్ సింగ్ (ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ ఛేంజ్, విదేశీ వ్యవహారాలు), 14. బి.ఎల్.వర్మ (వినియోగదారుల వ్యవహారాలు, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్), 15. శంతను ఠాకూర్ (పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్), 16. సురేష్ గోపి (పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాసెస్, టూరిజం), 17. డాక్టర్ ఎల్.మురుగన్ (ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్, పార్లమెంటరీ వ్యవహారాలు), 18. అజయ్ తమ్తా (ట్రాన్స్.పోర్ట్ అండ్ హైవేస్), 19. బండి సంజయ్ కుమార్ (హోమ్ ఎఫైర్స్), 20. కమలేష్ పాశ్వాన్ (రూరల్ డెవలప్‌మెంట్), 21. భగీరథ్ చౌదరి (వ్యవసాయం, రైతు సంక్షేమం), 22. సతీష్ చంద్ర దూబే (బొగ్గు, గనులు), 23. సంజయ్ సేథ్ (డిఫెన్స్), 24. రవ్‌నీత్ సింగ్ (ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, రైల్వేస్), 25. దుర్గాదాస్ ఉయ్‌కీ (ట్రైబల్ వెల్ఫేర్), 26. రక్షా నిఖిల్ ఖాడ్సే (యువజన సర్వీసులు, క్రీడలు), 27. సుకాంతా మజుందార్ (ఎడ్యుకేషన్, ఉత్తరాది రాష్ట్రాల సంక్షేమం), 28. సావిత్రీ ఠాకూర్ (మహిళ, శిశు సంక్షేమ శాఖ), 29. తొఖాన్ సాహు (హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్), 30. రాజ్ భూషణ్ చౌదరి (జలశక్తి), 31. భూపతిరాజు శ్రీనివాసవర్మ (భారీ పరిశ్రమలు, ఉక్కు), 32. హర్ష్ మల్హోత్రా (కార్పొరేట్ ఎఫైర్స్, రోడ్ ట్రాన్స్.పోర్ట్, హైవేస్), 33. నిముబెన్ జయంతిభాయ్ బంభానియా (వినియోగదారుల వ్యవహారాలు, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్), 34. మురళీధర్ మొహోల్ (సహకారశాఖ, పౌర విమానయాన శాఖ), 35. జార్జ్ కురియన్ (మైనారిటీ వ్యవహారాలు, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డైరీ), 36. ప్రతిభా మార్గరిటా (విదేశీ వ్యవహారాలు, టెక్స్.టైల్స్).

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana