జూన్ 13న స్కూళ్ల రీఓపెన్!
చంద్రబాబు ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఒకరోజు తరువాత అంటే, జూన్ 13న స్కూళ్లు తిరిగి తెరచుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమతో పాటు కోస్తా జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాల్లోని వర్షాల తీవ్రత బట్టి స్కూళ్లు పున:ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఉంటే, ఆయా జిల్లాల కలెక్టర్లు స్కూల్కు సెలవులు పొడిగించే అవకాశం ఉంది. మరోవైపు ఎండల తీవ్రత కూడా తగ్గలేదు. రాష్ట్రంలో వడగాడ్పులు ఎక్కువగా ఉన్నాయి.