- మోదీతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- ప్రమాణ స్వీకారానికి హాజరైన వివిధ దేశాధినేతలు
- హాజరైన అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, రజనీకాంత్
నరేంద్రమోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈశ్వరుడి మీద ఆయన ప్రమాణం చేశారు. స్వతంత్ర భారతంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి అయిన ప్రధాని అయిన రికార్డ్ మోదీ సొంతం చేసుకున్నారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాధినేతలతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భూటాన్ పీఎం షేరింగ్ తోబ్‌గే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు విక్రం సింఘే, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం దామీ, మండి ఎంపీ కంగనా రనౌత్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్, సీజేఐ చంద్రచూడ్ తదితరులు పాల్గొన్నారు.
#WATCH | Narendra Modi takes oath for the third straight term as the Prime Minister pic.twitter.com/Aubqsn03vF
— ANI (@ANI) June 9, 2024