- మోడీ జీ విశ్వ గురువు భారతదేశ ప్రధానమంత్రి గా ముడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
- వారి కేబినెట్ లో మన కరీంనగర్ ముద్దుబిడ్డ, హిందు టైగర్ మన పార్లమెంట్ సభ్యులు
జనవహిణి బ్యూరో భానుబాబు :- బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా చిగురుమామిడి మండల కేంద్రము లో మండల పార్టీ ఆద్వర్యంలో బాణ సంచలు,టపాసులు కాల్చిన ఆనంతరం మిఠాయిలు పంచి పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించడం జరిగింది.భారతదేశ విజయవంతమైన ప్రధానమంత్రిగా వరుసగా మూడవసారి ప్రమాణం చేసి చరిత్ర సృష్టించినందుకు గౌరవనీయులైన నరేంద్రమోదీ జీ కి మరియు బండి సంజయ్ జీకి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. మీ నిర్ణయాత్మక నాయకత్వంలో, భారతదేశం యొక్క అభివృద్ధి ప్రయాణం కొత్త ఊపును పొందుతుంది మరియు 2047 నాటికి భారతదేశాన్ని ‘అభివృద్ధి చెందిన భారతదేశం’గా మార్చాలనే సంకల్పం కొత్త శక్తిని పొందుతుంది. ప్రకాశవంతమైన పదవీకాలం కోసం ప్రధాన సేవకుడు మోడీ జీకి,కేంద్ర మంత్రి బండి సంజయ్ జీకి శుభాకాంక్షలు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా,మండల మరియు వివిధ గ్రామాల నాయకులు ,కార్యకర్తలు మరియు భాజపా,సంజయ్ అన్న అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.