Home తెలంగాణ నరసాపురం బిజెపి ఎంపీ భూపతి రాజుకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు 

నరసాపురం బిజెపి ఎంపీ భూపతి రాజుకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు 

0

posted on Jun 9, 2024 3:39PM

తాజాగా రాష్ట్రం నుంచి మరో ఎంపీకి కూడా మోదీ కేబినెట్‌లో స్థానం దక్కుతుందని తెలుస్తోంది. ఏపీ నుంచి కేంద్ర క్యాబినెట్ లోకి నరసాపురం బీజేపీ ఎంపీ  భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు చోటు దక్కిందని సమాచారం. జూన్ 9న (ఆదివారం)ఉదయం ప్రధాని నివాసంలో తేనీటి విందుకి శ్రీనివాస్ వర్మ హాజరైయ్యారు. ఢిల్లీలో నేడు  రాత్రి జరగబోయే మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరందరినీ మోదీ తేనీటి విందుకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే శ్రీనివాస వర్మ కూడా ఆ విందుకు హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఈయనకు కూడా మోదీ మంత్రివర్గంలో స్థానం దక్కిందని స్పష్టం అవుతోంది.

వైసీపీ ఆగడాలు, ఆకృత్యాలను గత కొన్నేళ్లుగా ఎండగడుతున్న నరసాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణ రాజు కు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉండి  నుంచి టిడిపి దక్కింది. ఈ ఎన్నికల్లో అతను టిడిపి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అక్కడ వైసీపీ అభ్యర్థి ఓటమికి ముఖ్య భూమిక వహించారు. కూటమిలో భాగంగా నరసాపురం సీటు బిజెపికి వెళ్లింది. నరసాపురం మాజీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచినప్పటికీ వైసీపీ అధినేత జగన్ తో విభేధించడంతో రఘురామ కృష్ణ రాజు రెబల్ ఎంపీగా కొనసాగారు. తెలుగు దేశం పార్టీలో సభ్యత్వం  తీసుకోని కారణంగా అతను టిడిపిలో చేరలేకపోయారు. టిడిపి, జనసేన బిజెపి కూటమి ఏర్పడిన తర్వాతే అతను టిడిపిలో చేరి ఉండి టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రఘు రామృష్ణ రాజు వైసీపీని ఎప్పటికప్పుడు ఎండగట్టడం కూటమిలో భాగంగా నరసాపురం బిజెపి కి దక్కినప్పటికీ టిడిపి, జనసేన శ్రేణులు శ్రీనివాసవర్మ ను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. 

ఏపీ నుంచి మరో ఎంపీకి కేంద్రంలో మంత్రి పదవి ఖరారైంది. నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర క్యాబినెట్ లో చోటు లభించింది. 

ఈ నేపథ్యంలో, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఎంపీగా గెలిచారు. ఇప్పుడాయనను కేంద్ర మంత్రి పదవి వరించింది. 

శ్రీనివాసవర్మ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1991 నుంచి 1995 వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1995 నుంచి 1997 వరకు భీమవరం టౌన్ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1997 నుంచి 1999 వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ కార్యదర్శిగా పనిచేశారు. 

1999 నుంచి 2001 వరకు నరసాపురం పార్లమెంటు కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీనివాసవర్మ పనితీరుకు మెచ్చి ఆయనను 2001లో బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. 2003 నుంచి 2009 వరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 


2009లో భూపతి రాజు  శ్రీనివాసవర్మ బీజేపీ టికెట్ పై లోక్ సభకు పోటీ చేశారు. 2010 నుంచి 2018 వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2018 నుంచి 2020 వరకు బీజేపీ జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక, 2020 నుంచి 2023 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున నరసాపురం నుంచి బరిలో దిగి ఎంపీగా విజయం సాధించారు. ఈ సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Exit mobile version