వర్షంగల్కు శేషం
వర్షంగల్కు శేషం మలయాళ సినిమా జూన్ 7వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రం తెలుగు ఆడియో డబ్బింగ్‍లోనూ అందుబాటులో ఉంది. అలాగే, తమిళం, హిందీ, కన్నడ వెర్షన్‍ల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన వర్షంగల్కు శేషం చిత్రంలో ప్రణవ్ మోహన్ లాల్, ధ్యాన్ శ్రీనివాసన్, కల్యాణి ప్రియదర్షి, నివిన్ పౌలీ మెయిన్ రోల్స్ చేశారు. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్‍బస్టర్ అయింది.