వైసీపీ హయాంలో
అధికారంలోకి వచ్చిన తరువాత చెత్త పన్నును రద్దు చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. చెత్త సేకరణ పేరుతో గత ప్రభుత్వం ఇళ్ల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.150 చొప్పున వసూలు చేసేది. ఇలా ఏటా రూ.200 కోట్లు వసూలు చేసేది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఇళ్ల నుంచి చెత్తను సేకరించడాన్ని 2021 అక్టోబర్ లో ప్రవేశపెట్టారు. దీనిపై చెత్త పన్ను వసూలు చేయడం ప్రారంభించింది. చెత్తను సేకరించడానికి 2,164 ఆటోలు కొనుగోలు చేశారు. రాష్ట్రంలో 48 కార్పొరేషన్, మున్సిపాలిటీలకు కేటాయించారు. ప్రజల నుంచి పన్ను వసూలు చేసి, ఒక్కో వాహనానికి నెలకు రూ. 65 వేలు ఇవ్వాలని కార్పొరేషన్, మున్సిపాలిటీల కమిషనర్లకు రాష్ట ప్రభుత్వం ఆదేశించింది.