Home తెలంగాణ కరీంనగర్ గ్యాంగ్ వార్ లో కొత్తకోణం, జైలులో ఉంటూ బయట బెదిరింపులు-karimnagar gang war case...

కరీంనగర్ గ్యాంగ్ వార్ లో కొత్తకోణం, జైలులో ఉంటూ బయట బెదిరింపులు-karimnagar gang war case culprit threaten to other with police local leaders support ,తెలంగాణ న్యూస్

0

Karimnagar Gang War : కరీంనగర్ జిల్లా పచ్చునూర్ లో గ్యాంగ్ వార్ హత్య కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఇంటి స్థలం వివాదం విషయంలో పెద్దమనుషులుగా వెళ్లిన రౌడీషీటర్ లు గోపు ప్రశాంత్ రెడ్డి, నన్నేవేని రమేష్ అలియాస్ జానీ భాయ్ మధ్య వ్యక్తిగత కక్షలు పెరిగి ప్రశాంత్ హత్యకు దారి తీసింది. ఇంటి స్థలం విషయంలో నెలకొన్న వివాదం పరిష్కరించేందుకు జానీ భాయ్ ని వెంకటేష్ కు పరిచయం ఎవరు చేశారన్నదే హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని ఓ మీడియా సంస్థలో కెమెరా మెన్ గా పనిచేస్తున్న వెంకటేష్ కు, నన్నేవేని రమేష్ అలియాస్ జానీ భాయ్ ను ల్యాండ్ డీలింగ్ విషయంలో పరిచయం చేయడం వల్లే కక్షలు పెరిగి హత్యకు దారి తీసిందని స్థానికులు భావిస్తున్నారు. రౌడీ షీటర్ గా ఉన్న నన్నేవేని రమేష్ అలియాస్ జానీ భాయ్ కి హైదరాబాద్ లో ఉన్న వెంకటేష్ కు మధ్య రాయబారం నడిపి ఇద్దరు మిలాఖత్ అయ్యేలా వ్యవహరించిన తరువాతే ఈ తతంగం అంతా జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏ1 నిందితుడు రమేష్ అలియాస్ జానీభాయ్, వెంకటేష్ ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారే అయినప్పటికీ మొదట్లో అంతగా పరిచయం లేదని, ఈ భూమి విషయంలో వీరిద్దరిని పరిచయం చేడయం వల్లే జానీ జోక్యం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

Exit mobile version