Sunday, January 19, 2025

అమెరికాలో ఉన్న రైతుకు ఆరు బస్తాల విత్తనాలు-వ్యవసాయ అధికారుల అక్రమ దందా!-mahabubabad four agriculture officials suspended seeds selling at high to ap ,తెలంగాణ న్యూస్

రైతుల పేరున రికార్డులు

రైతులకు రావాల్సిన విత్తనాలను అక్రమంగా తరలించడంతో పాటు రైతులకు పంపిణీ చేసినట్టుగా రికార్డులు సృష్టించడం మొదలుపెట్టారు. ఇలా తొర్రూరు మండలం జమస్తాన్పురం గ్రామానికి చెందిన ఓ రైతు అమెరికాలో స్థిరపడగా, ఆయన పేరున ఆరు బస్తాల జీలుగ విత్తనాలు పంపిణీ చేసినట్లు రికార్డులు తయారు చేశారు. వాస్తవానికి ఆయన పట్టాదారు పాస్ బుక్ కూడా బ్యాంక్ లాకర్ లో ఉండగా, ఆయన పేరున విత్తనాలు పంపిణీ కావడం గమనార్హం. అంతేగాకుండా గుర్తూరు గ్రామానికి చెందిన మరో రైతు పేరున 2 బస్తాలు, ఖానాపురం రైతుకు మూడు బ్యాగులు ఇచ్చినట్లు రాసుకున్నారు. వాస్తవానికి వారెవరికీ విత్తనాలు అవసరం లేకున్నా, విత్తనాలు పంపిణీ చేసినట్టు రికార్డుల్లో రాశారు. అంతేగాకుండా గ్రానైట్ క్వారీలు, మామిడి తోటలు ఉన్న స్థలాలలకు కూడా రైతుల విత్తనాలు ఇచ్చినట్టు రికార్డులు సృష్టించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana