Home ఎంటర్టైన్మెంట్ Mirai Manchu Manoj Glimpse: వావ్ అనిపించేలా మిరా‍య్ నుంచి మంచు మనోజ్ గ్లింప్స్.. పవర్‌ఫుల్‍...

Mirai Manchu Manoj Glimpse: వావ్ అనిపించేలా మిరా‍య్ నుంచి మంచు మనోజ్ గ్లింప్స్.. పవర్‌ఫుల్‍ పాత్రతో కమ్‍బ్యాక్: వీడియో

0

“అత్యంత టాలెంటెడ్ యాక్టర్.. ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫోర్స్‌గా మారారు. మిరాయ్‍లో కొత్త అవతారంలో ఫేవరెట్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్‍ను తీసుకొస్తున్నాం” అని మిరాయ్ చిత్రాన్ని నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ గ్లింప్స్ లాంచ్‍కు ఈవెంట్ కూడా నిర్వహించింది.

మిరాయ్ గురించి..

మిరాయ్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ సినిమాతో బ్లాక్‍బస్టర్ సాధించిన తేజ సజ్జా ఈ మూవీలో హీరోగా నటిస్తున్నారు. సూపర్ యోధ అనే సూపర్ హీరో పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే మిరాయ్ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్ చాలా ఇంట్రెస్ట్ పెంచేసింది. అశోక చక్రవర్తి చేసిన కళింగ యుద్ధం.. దేవ రహస్యం.. తొమ్మిది గ్రంథాలు అంటూ వచ్చిన ఆ గ్లింప్స్‌తో హైప్ విపరీతంగా పెరిగింది.

మిరాయ్ సినిమా రిలీజ్ డేట్‍ను కూడా ఇప్పటికే టీమ్ ఖరారు చేసింది. 2025 ఏప్రిల్ 18వ తేదీన విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, చైనీస్ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. 2డీతో పాటు 3డీ వెర్షన్ కూడా రానుంది.

మిరాయ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మిస్తున్నారు. గౌరహరి సంగీతం అందిస్తున్నారు.

సినిమాటోగ్రఫర్ టు డైరెక్టర్

సినిమాటోగ్రాఫర్‌గా కార్తీక్ ఘట్టమనేని బాగా పాపులర్ అయ్యారు. కొన్ని సూపర్ హిట్ సినిమాలకు పని చేశారు. అయితే, రవితేజ హీరోగా ఈ ఏడాది రిలీజైన ఈగల్ చిత్రానికి కార్తీక్ దర్శకత్వం వహించారు. సూర్య వర్సెస్ సూర్య తర్వాత డైరెక్టర్‌గా కార్తీక్‍కు ఇది రెండో మూవీ. ఈగల్ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా ఆయన టేకింగ్‍పై ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు, మిరాయ్ చిత్రాన్ని భారీస్థాయిలో తెరకెక్కిస్తున్నారు కార్తీక్ ఘట్టమనేని. ప్రస్తుతం పూర్తిగా డైరెక్షన్‍పైనే ఆయన పూర్తి దృష్టి సారించారు.

Exit mobile version