Sunday, February 9, 2025

Mars retrograde: కుజుడి తిరోగమనం.. వీరికి పెళ్లి యోగం, ధనవంతులు కాబోతున్నారు

Mars retrograde: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల అధిపతి అయిన కుజుడు త్వరలో తిరోగమన దశలో తన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తిరోగమనంలో అంగారకుడు సంచరించబోతున్నాడు. కుజుడు వివాహం, భూమి, ఆస్తి, ధైర్యానికి కారణమయ్యే గ్రహం. కుజ పరివర్తన జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది.

ఇది జీవితంలో ప్రధానంగా ప్రేమ, పెళ్లి సంబంధాలను ప్రభావితం చేస్తుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 6, 2024 నుండి ఫిబ్రవరి 23, 2025 వరకు కుజుడు సింహ రాశి నుండి కర్కాటక రాశిలోకి తిరోగమన సంచారం చేస్తాడు. కుజుడు తిరోగమన స్థితిలో ఉండటం ద్వారా కొన్ని రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయి. చేసే ప్రతి పనిలో ఆశించిన ఫలితాలు పొందుతారు. సంబంధాల్లో ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. కుజుడి తిరోగమనంతో ఏయే రాశులు ప్రకాశిస్తాయో తెలుసుకుందాం.

మేష రాశి

కుజుడి తిరోగమన కదలిక మేష రాశి వారికి కలిసి వస్తుంది. భాగస్వామితో సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. సంబంధాల్లో ఆనందం ఉంటుంది. కెరీర్ లో ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. పరస్పర అవగాహన, సమన్వయం జీవిత భాగస్వాముల మధ్య మెరుగ్గా ఉంటుంది. ఒంటరిగా ఉన్న వారి జీవితంలోకి భాగస్వామి వచ్చే అవకాశం ఉంది. శృంగార జీవితంలో ఆనందం ఉంటుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. ప్రతి రంగంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. ప్రేమ జీవితాన్ని, ఇంటి బాధ్యతలను సమతుల్యం చేసుకోవాలి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకునేందుకు ఇది చక్కని సమయం.

కన్యా రాశి

కుజుడి తిరోగమనం కారణంగా కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఒంటరి వ్యక్తులు కొత్త వ్యక్తులను కలుస్తారు. వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో సమతుల్యత పాటించాలి. దీర్ఘకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నవాళ్లు ఈ సమయంలో భాగస్వామి కోరిక తీరుస్తారు. మీ భాగస్వామి భావోద్వేగాలను అర్థం చేసుకుంటారు. వారి అవసరాలను నెరవేరుస్తారు. దీంతో మీ ప్రేమ జీవితం మరింత మధురంగా ఉంటుంది.

మకర రాశి

ఒంటరి వ్యక్తుల ప్రేమ జీవితంలో ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. రిలేషన్ షిప్ లో ఉన్నవారు తమ భాగస్వామితో బంధాన్ని మరింత బలపరుచుకుంటారు. ఈ సమయంలో సంబంధాలలో నెలకొన్న సమస్యలు అధిగమిస్తారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతం అవుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వస్తు సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు. ప్రతి పనిలో ఊహించిన దాని కంటే మెరుగైన ఫలితాలను అందిస్తుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఇది మంచి అవకాశం. జీవిత భాగస్వామి అభిప్రాయాలను గౌరవించాలి.

తులా రాశి

మీరు ఒంటరిగా ఉన్నట్టయితే మీ ప్రేమ జీవితంలోకి కొత్త వ్యక్తి రాక జరుగుతుంది. కెరీర్ పరంగా మీ లక్ష్యాలను చేరుకుంటారు. ప్రేమికులకు కుజుడి తిరోగమనం అద్భుతంగా మారుతుంది. పని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకునేందుకు కుజుడు ఈ సమయంలో మంచి అవకాశాలను ఇవ్వబోతున్నాడు. జీవిత భాగస్వామి ఆకాంక్షలను నెరవేర్చగలుగుతారు.

ను చేరుకుంటారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana