మామూలుగా మన తెలుగు ప్రాంతాన్ని ‘రత్నగర్భ’ అని పిలుస్తూ వుంటారు. ఎందుకంటే, మన ప్రాంతంలో రత్నాలు బాగా దొరికేవి కాబట్టి. ఇప్పుడు ఈ న్యూస్‌లో చెప్పబోయేది మన రత్నగర్భ గురించి కాదు.. మన తెలుగింటి ‘రాళ్ళగర్భ’ గురించి. కోనసీమ జిల్లా అమలాపురానికి సమీపంలోని దేవగుప్తం గ్రామానికి చెందిన జాలెం నరసవేణి అనే 31 సంవత్సరాల వయసున్న మహిళ గాల్‌స్టోన్స్ సమస్య, విపరీతమైన కడుపునొప్పి సమస్యలతో అమలాపురంలోని ఎ.ఎస్.ఎ. ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు షాకైపోయారు. ఆమె కడుపులో ఒకటి కాదు.. రెండు కాదు.. పోనీ వంద కూడా కాదు.. ఏకంగా ఐదు వందల డెబ్భై (570) రాళ్ళున్నాయి. డాక్టర్లు జాగ్రత్తగా ఆపరేషన్ చేసి ఆమె కడుపులో వున్న ఆ రాళ్ళను బయటకి తీసేశారు. ఒక వ్యక్తి కడుపులో ఇన్ని రాళ్ళు వుండటం చాలా అరుదైన విషయమని డాక్టర్లు చెబుతున్నారు. 570 రాళ్ళను పొట్టలో భద్రపరుచుకున్న ‘రాళ్ళగర్భ’ నరసవేణి ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా వుంది.