Wednesday, February 5, 2025

జుట్టుకే కాదు ఆరోగ్యానికి కూడా మందారం పువ్వుతో అనేక లాభాలు-iron deficiency to weight loss health benefits of mandaram flower ,లైఫ్‌స్టైల్ న్యూస్

మనమందరం మందారం పువ్వును చూశాం. ఇవి వివిధ రంగులలో లభిస్తాయి. చాలా మంది ఈ మొక్కను తమ ఇంటి తోటలలో పెంచుతారు. మందారం పువ్వు జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే దీని పూలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని మీకు తెలుసా? మందారం పువ్వు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలియకపోతే, ఇప్పుడు తెలుసుకోండి.

ఐరన్ లోపాన్ని తొలగిస్తుంది

మీరు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా? మందారం పువ్వు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే, నిజానికి ఈ పువ్వులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. మందారం మొగ్గలను గ్రైండ్ చేసి దాని రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది మీ మెుత్తం ఆరోగ్యానికి మంచిది. అయితే అతిగా మాత్రం తీసుకోకూడదు.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

మీరు చాలా కాలం పాటు బరువు తగ్గాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ఇందుకు మందారం పువ్వు కచ్చితంగా మీకు సహాయం చేస్తుంది. దీని కోసం మీరు మందారం ఆకులతో టీ తయారు చేసి తాగవచ్చు. మందార టీ మీకు శక్తిని ఇస్తుంది. ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది. ఇది కాకుండా మీ జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అంతే కాకుండా దీని పువ్వు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది

చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి

వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్యం కూడా పెరుగుతుంది. అందువలన అనేక మంది ఆందోళన చెందుతారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంపై ఎక్కువగా ఆలోచిస్తారు. అటువంటి పరిస్థితిలో మందారం పువ్వు కచ్చితంగా మీకు సహాయం చేస్తుంది. దీని పువ్వులో అధిక స్థాయిలో యాంటీ ఏజింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి. వృద్ధాప్యంలో కూడా మీ అందాన్ని కాపాడుకోవడంలో ఇవి ఎంతగానో సహకరిస్తాయి. ఇది ఫ్రీ రాడికల్స్‌ను కూడా తొలగిస్తుంది. వృద్ధాప్యంలో కూడా యవ్వనంగా కనిపించడానికి మందారం పువ్వును ఉపయోగించండి.

అధిక రక్తపోటును నియంత్రిస్తుంది

మీరు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతుంటే, మందారం పువ్వు తప్పకుండా మీకు సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ పువ్వులో అధిక రక్తపోటు సమస్యతో పోరాడే గుణాలు ఉన్నాయి. అవి మీ అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇందుకోసం మందారం టీ తాగడం చాలా మంచిది.

జలుబు, దగ్గుకు మంచిది

మందారం ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గువంటివి వచ్చినప్పుడు మందారం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

అలాగే తరచుగా జలుబు, దగ్గు సమస్యతో బాధపడుతుంటే మందారం పువ్వులు తింటే ఉపశమనం లభిస్తుంది. అలాగే దీని పువ్వులు గొంతు నొప్పి నుండి అద్భుతమైన ఉపశమనాన్ని అందిస్తాయి.

అయితే మందారం పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అతిగా తినకూడదు. తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. మందారం పువ్వు మీ మెుత్తం శ్రేయస్సుకు మంచిది. కానీ మితంగా తీసుకోవాలి. ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది నిపుణుల సలహా మేరకు దీనిని తీసుకోండి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana