Home ఆంధ్రప్రదేశ్ South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ...

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

0

తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకాయని, ఇవాళ మాల్దీవులుు, కోమరిన్‌ ప్రాంతంలో కొంతమేర, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, దక్షిణ అండమాన్‌ సముద్రంలోని కొంత మేర విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.

Exit mobile version