Monday Motivation: సీతాపురానికి వెళ్లే దారిలో ఒక పెద్ద చెట్టు ఉంది. అది దారినపోయే వారికి ఎంతో మేలు చేస్తుంది. ఎండలో నీడనిస్తుంది. తన పండ్లతో ఆకలి తీరుస్తుంది. అయినా కూడా ఆ చెట్టులోని భాగాలైన వేర్లు, ఆకులు, పండ్లు ఎప్పుడు తిట్టుకుంటూ, కొట్టుకుంటూనే ఉంటాయి. నేను గొప్ప అంటే… నేను గొప్ప అంటూ పక్క వాటిని చులకనగా చూస్తాయి. ఎన్నోసార్లు చెట్టు వాటిని శాంత పరచడానికి ప్రయత్నించింది. అయినా కూడా ఆకులు, వేర్లు, పండ్లు, కొమ్మలు తామే గొప్ప అని విర్రవీగడం మొదలుపెట్టాయి. ఒకదానికొకటి సహకరించుకోవడం మానేసాయి. ఒకరోజు చెట్టు వీటికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంది.