ఏపీలో శాసనసభ ఎన్నికల అనంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పలుచోట్ల దాడులు జరుగుతున్నాయి. తాడిపత్రిలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక్కడ జెసి కేతిరెడ్డి వర్గాల మధ్య తీవ్ర గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, సీసీటీవీని పగులగొట్టి తమ వర్గీయులపై విచక్షణ రహితంగా దాడి చేశారని YCP ఆరోపిస్తుంది. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ను కూడా విడుదల చేసింది.