2024 లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల కన్నా తక్కువ సీట్లు వస్తే ఏమైనా ప్లాన్ బి ఉందా అన్న ప్రశ్నపై కేంద్ర మంత్రి అమిషా కీలక వ్యాఖ్యలు చేశారు. 60 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడే ప్లాన్ B తయారు చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గత పది సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేశామన్నారు. 60 కోట్ల మంది లబ్ధిదారులు తమ వెంట ఉన్నారని అమిత్ షా తెలిపారు. సైన్యం సహా అన్ని వర్గాల ప్రజలు మోదీ వెంటనే ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.