Sunday, January 12, 2025

OTT: దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే- ఓటీటీలోకి వచ్చిన న్యూ హారర్ ఫాంటసీ థ్రిల్లర్- తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Dead Boy Detectives OTT Release: ఓటీటీల్లో అనేక రకాల, విభిన్నమైన జోనర్స్, కాన్సెప్ట్స్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా భూతద్ధం భాస్కర్ నారాయణ, హారర్ మూవీ తంత్ర, పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ సినిమాగా భీమా, క్రైమ్ థ్రిల్లర్‌గా సైరన్, ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా టిల్లు స్క్వేర్ సినిమాలు ఓటీటీల్లో ఇప్పుడు సందడి చేస్తున్నాయి.

డెడ్ బాయ్ డిటెక్టివ్స్ ఓటీటీ

ఇక మలయాళ సినిమాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, తాజాగా టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ కాకుండా హాలీవుడ్ నుంచి సరికొత్త డిఫరెంట్ జోనర్‌లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇందులో దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాయి. మరణాంతరం ఒక డిఫరెంట్ వరల్డ్‌లో ఉన్న ఇద్దరు టీనేజర్ గోస్ట్స్ క్రైమ్‌మై ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది కొత్తగా ఉంది. ఆ సిరీస్ పేరే డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (Dead Boy Detectives OTT).

హారర్ ఫాంటసీ థ్రిల్లర్

హారర్ ఫాంటసీ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన డెడ్ బాయ్ డిటెక్టివ్స్ వెబ్ సిరీస్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 25 అంటే ఈ గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ, ఫ్రెంచ్, జర్మనీ, హంగేరియన్, ఇండేనేషియన్, ఇటాలియన్, జపనీస్, పొలిష్, స్పానిష్, థాయ్, టర్కిష్, ఉక్రేనియన్ వివిధ ఇంటర్నేషనల్ భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

డీసీ కామిక్ నుంచి

నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌గా వచ్చిన డెడ్ బాయ్ డిటెక్టివ్స్ DC కామిక్ నుంచి తీసుకున్నారు. ఇప్పటికే డీసీ కామిక్‌లో అనేక స్టోరీస్ వచ్చాయి. తాజాగా దీన్ని లైవ్ యాక్షన్‌లా సిరీస్ తెరకెక్కించారు. డీసీ కామిక్ పుస్తకాలలో కనిపించే ఇద్దరు టీన్ ఘోస్ట్ డిటెక్టివ్‌ల పాత్రలు చాలా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు స్వయంగా ఓ సిరీస్ తీసుకొచ్చారు. ఈ సిరీస్ అంతా ఇద్దరు టీన్ ఘోస్ట్ డిటెక్టివ్‌ల పాత్రల చుట్టూ నడుస్తుంటుంది.

పారానార్మల్ కేసులు

ఎడ్విన్ అండ్ చార్లెస్ ఇద్దరు టీనేజర్స్ చనిపోతారు. వారు తమ మరణానంతర జీవితాన్ని కూడా భూమిపై గడుపుతుంటారు. అంతేకాకుండా ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ స్టార్ట్ చేసి సిటీలో జరిగే పారానార్మల్ కేసులను పరిశోధిస్తారు. వారికి జీవించి ఉన్న (అంటే చనిపోని) క్లైర్‌వాయెంట్ అయిన క్రిస్టల్ ప్యాలెస్ సహాయం చేస్తాడు.

8 ఎపిసోడ్స్-గంట రన్ టైమ్

“డెడ్ బాయ్ డిటెక్టివ్స్”లో లూకాస్ గేజ్ క్యాట్ కింగ్ ఓవర్-ది-టాప్ హాస్య పాత్రలో కూడా కనిపించాడు. “ది సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెట్టీ” నటుడు డేవిడ్ ఇయాకోనో దెయ్యంగా నటించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న “డెడ్ బాయ్ డిటెక్టివ్స్” సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ దాదాపుగా గంటపాటు రన్ టైమ్‌తో ఉంది. అయితే, ఒక్కో ఎపిసోడ్ ఒక్కో కేస్‌ను సాల్వ్ చేసేదానిలా ఉంది.

ఊహించని ట్విస్ట్స్‌తో

ఈ సిరీస్‌లో ఎపిసోడ్స్ ముందుకు పోయినకొద్దీ ఊహించని ట్విస్టులు, గ్రిప్పింగ్ సీన్స్, ఊహించని జీవులతో ఎంతో థ్రిల్లింగ్‌గా ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇక సిరీస్‌కు తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ సెట్ అయినట్లు అనిపిస్తోంది. వీకెండ్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి ఒక మంచి హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి డెడ్ బాయ్ డిటెక్టివ్స్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana