Sunday, January 12, 2025

Krishna mukunda murari april 27th: సరోగసి ద్వారా పిల్లల్ని కందామన్న కృష్ణ.. మురారి తన వాడేనని సంబరపడుతున్న ముకుంద

Krishna mukunda murari serial april 27th episode: పరిమళ కోసం కృష్ణ హాస్పిటల్ కి వస్తుంది. యూఎస్ వెళ్లారని రెండు మూడు నెలల తర్వాత పరిమళ వస్తుందని అక్కడి డాక్టర్స్ చెప్తారు. మేడమ్ ఉంటే ఏసీపీ సర్ ఎందుకు డల్ గా ఉన్నారో తెలుసుకునే దాన్ని అనుకుంటుంది.

కృష్ణకి మళ్ళీ కడుపు నొప్పి

కృష్ణ హాస్పిటల్ లో ఉండగానే మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది. ఇంట్లో కృష్ణ కోసం రేవతి వెతుకుతుంది. మురారిని అడిగితే గుడికి వెళ్ళి ఉంటుందని చెప్తాడు. ఒక్కదాన్ని ఎందుకు పంపించావు తోడుగా వెళ్లొచ్చు కదా అంటుంది. గుడికి వెళ్ళి కృష్ణని తీసుకురమ్మని రేవతి చెప్తుంది.

కృష్ణ ఒంటరిగా ఉండటం తనకి నాకు ఇద్దరికీ మంచిది. తను ఎదురుగా ఉంటే ఏ క్షణంలో నిజం చెప్తానోనని భయంగా ఉందని అనుకుంటాడు. హాస్పిటల్ వాళ్ళు మురారికి ఫోన్ చేసి విషయం చెప్తారు. ఇంతకముందు ఫోన్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడలేదని నర్స్ అడుగుతుంది. కృష్ణ హాస్పిటల్ లో ఉందని తెలుసుకుని మురారి టెన్షన్ గా బయల్దేరతాడు.

తనకి మళ్ళీ టెస్ట్ లు ఎందుకు చేస్తున్నారు మొన్న పరిమళ మేడమ్ చేశారని కృష్ణ డాక్టర్ ని అడుగుతుంది. మీకు అబద్ధం చెప్పారని డాక్టర్ అనేసరికి కృష్ణ ఏమంటున్నారు ఇది నార్మల్ గా వచ్చే కడుపు నొప్పి కదా అంటుంది. కాదు కృష్ణ నిజం చెప్తే తట్టుకోలేవని దాచిపెట్టారని డాక్టర్ చెప్తుంది.

నిజం తెలుసుకున్న కృష్ణ

రిపోర్ట్స్ తీసుకుని కృష్ణ చూస్తుంది. నీ గర్భసంచి పూర్తిగా డ్యామేజ్ అయ్యింది కృష్ణ నీకు పిల్లలు కలగకపోవచ్చు, ఇంతవరకు ఎందుకు తెచ్చుకున్నావ్ జాగ్రత్తగా ఉండాలి కదాని డాక్టర్ అంటుంది. కృష్ణ నిజం తెలిసి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఏసీపీ సర్ బాధపడటానికి కారణం ఇదా? నిజం చెప్తే ఏమైపోతానో అని ఒక్కరే ఎంత బాధపడ్డారని ఏడుస్తుంది.

పరిస్థితి చెయ్యి దాటిపోయిందని డాక్టర్ చెప్తుంది. మురారి వచ్చి ఏమైందని అంటాడు. కృష్ణ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ముకుంద వాళ్ళని చాటుగా చూస్తుంది. ఎలా ఉంది కృష్ణకి అని మురారి అడిగితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అంటుంది.

నాకు అన్యాయం చేశారు

నా గర్భసంచి పోయింది ఏసీపీ సర్. గర్భసంచి తీసేయాలి పిల్లలు పుట్టరు అని కృష్ణ ఏడుస్తుంటే ముకుంద నవ్వుకుంటుంది. పెద్దత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనని ఏడుస్తుంది. మురారి తనని దగ్గరకు తీసుకుని ఓదారుస్తాడు. దేవుడు తనకి ఎందుకు ఇంత అన్యాయం చేశాడని బాధపడుతుంది.

నాకు అన్యాయం చేశారు కదా దానికి ఆ దేవుడే నా ద్వారా శిక్ష పడేలా చేశాడని ముకుంద అనుకుంటుంది. మీరు పడిన బాధ తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఏ చిన్న విషయం కూడా దాచడం ఈ ఏబీసీడీల అబ్బాయికి దాచడం అలవాటు లేదు కదా మరి ఇది ఎందుకు దాచారని అంటుంది.

మురారికి ధైర్యం చెప్పిన కృష్ణ

నేను ఏం అయిపోను ఏబీసీడీల అబ్బాయి నా పక్కన ఉంటే చాలు ఎంత బాధని అయినా భరిస్తానని అంటుంది. నువ్వు చాలా గ్రేట్ కృష్ణ నాకోసం ఇంత ధైర్యంగా ఉన్నావని మురారి తనకి ధైర్యం చెప్తాడు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లండి, మీరు నేను మాత్రమే ఉండాలి. ప్రశాంతంగా మాట్లాడుకునే చోటు కావాలని అడుగుతుంది.

మురారి భవానీ పసిపిల్లల గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని చాలా బాధపడతాడు. ముకుంద మురారి దగ్గరకు వస్తుంది. కంగారుగా మీరు హాస్పిటల్ కి బయల్దేరడం చూసి మీకోసం వచ్చానని అంటుంది. ఎందుకు వచ్చావ్ హాస్పిటల్ కి నేను బయల్దేరానని విషయం నీకు ఎలా తెలుసు అంటాడు.

నిజం తెలుసన్న మీరా

మీకు ఇందాక హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేశాను నర్స్ చెప్పింది విన్నాను. కృష్ణ పరిస్థితి తెలిసి కంగారుగా వచ్చాను. ఇక్కడకు వచ్చి మొత్తం విన్నానని అంటుంది. ఇంట్లో ఎవరితో చెప్పొద్దని మురారి అడుగుతాడు. ఈ విషయం తెలిస్తే ఇంట్లో అందరూ ఎంత కంగారుపడతారో తెలుసని అంటుంది.

ఇంట్లో చెప్పొద్దని మురారి మాట తీసుకుంటాడు. ఇప్పుడే చెప్తే ఎవరికి తోచిన సలహా వాళ్ళు ఇచ్చి తన ప్లాన్ పాడు చేస్తారని అనుకుని మురారికి మాట ఇస్తుంది. నిజం తెలిసి ఎంత నరకం అనుభవించారోనని సానుభూతి చూపిస్తుంది. మురారి దగ్గర మార్కులు కొట్టేయడం కోసం కుటుంబం, బాధ్యత అంటూ డైలాగులు కొడుతుంది.

సరోగసి ఐడియా

కృష్ణ తొమ్మిది నెలలు బిడ్డని మోయకపోయినా మరొక దారి ఉందని ముకుంద చెప్తుంది. మీ పెద్దమ్మకి పిల్లలు కావాలని అంటున్నారు. మీ కోరిక నెరవేరడానికి సరోగసి మార్గం ఉంది. కృష్ణ గర్భంలో బిడ్డ పెరిగే అవకాశం లేదు కాబట్టి వేరే గర్భం అద్దెకి తీసుకుని అందులో మీ బిడ్డని పెంచండి. అది మీ బిడ్డ అవుతుందని ముకుంద ఐడియా ఇస్తుంది.

మురారి మాత్రం ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పొద్దని అంటాడు. మాట ఇచ్చాను కదా ముందు ఈ విషయం కృష్ణకి చెప్పమని చెప్తుంది. కృష్ణ తప్పకుండా ఒప్పుకుంటుంది. అప్పుడే కదా కథ కొత్త మలుపు తిరుగుతుంది కథ నా కంట్రోల్ లో ఉంటుందని ముకుంద సంబరపడుతుంది.

కుమిలిపోతున్న కృష్ణ

మురారి పడిన బాధ తలుచుకుని కృష్ణ బాధపడుతుంది. పెద్దత్తయ్యకు మాట ఇచ్చాను ఇప్పుడు నాకు పిల్లలు పుట్టరు మీకు ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి, నా మొహం ఎలా చూపించాలని కృష్ణ ఏడుస్తుంది. జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దని మురారి సర్ది చెప్తాడు.

సరోగసి ద్వారా పిల్లల్ని కనొచ్చని కృష్ణకి చెప్పాలా వద్దా అని మురారి ఆలోచిస్తాడు. ఇప్పుడు చెప్తే కృష్ణ ఇంకా ఎక్కువ బాధపడుతుంది. ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు మెల్లగా చెప్పాలని అనుకుంటాడు. మీరాకి నిజం తెలుసనే విషయం కూడా తెలియకూడదని అనుకుంటాడు.

తరువాయి భాగంలో..

పెద్దత్తయ్యని చూడగానే ఎక్కడ నిజం చెప్పేస్తానో అని గుండెల్లో వణుకు పుడుతుంది ఏసీపీ సర్. పెద్దత్తయ్యకి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ మనకి కావాలి అన్నా ఒక మార్గం ఉంది అంటుంది. ఏంటని మురారి అంటే సరోగసి అని చెప్తుంది. ముకుంద వాళ్ళ మాటలు విని సంతోషిస్తుంది. ఒక మంచి అమ్మాయిని చూసి సరోగసికి వెళ్లిపోదామని అంటే మురారి అందుకు ఒప్పుకుంటాడు. తన ప్లాన్ వర్కౌట్ అవుతుంది, మురారి ఇక నావాడు కాకుండా ఎవరూ ఆపలేరని ముకుంద ఆనందపడుతుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana