Aquaman 2 OTT: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ అక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఈ హాలీవుడ్ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. మే 21 నుంచి జియో సినిమా ఓటీటీలో అక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్ స్ట్రీమింగ్ కాబోతోంది.
జియో ఓటీటీలో ఈ హాలీవుడ్ మూవీని ఫ్రీగా చూడొచ్చు. జియో ప్రీమియర్ సబ్‌స్కైబర్లు ఎలాంటి యాడ్స్ లేకుండా సినిమాను చూసే వెసులుబాటు ఉంది. ప్రీమియర్ సబ్‌స్క్రిప్షన్ లేనివారి కోసం యాడ్స్‌తో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు జియో ప్రకటించింది.
అమెజాన్‌లో కూడా…
అక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు మరో ఓటీటీలోకి కూడా ఈ మూవీ రాబోతుండటం ఆసక్తికరంగా మారింది.
అక్వామెన్ సీక్వెల్…
2018లో రిలీజైన అక్వామెన్‌కు సీక్వెల్‌గా అక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న ఈ మూవీ నిర్మాతలకు మాత్రం లాభాలను తెచ్చిపెట్టింది. 215 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సీక్వెల్ 435 మిలియన్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది.
ఇండియాలో అక్వామెన్ సీక్వెల్‌తో పాటు డంకీ, సలార్ ఒకేసారి థియేటర్లలో రిలీజయ్యాయి. ఈ ఇండియన్ సూపర్ స్టార్లతో బాక్సాఫీస్ వద్ద పోటీపడలేకపోయింది ఈ హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ. తొలిరోజు రెండు కోట్లలోపే వసూళ్లను రాబట్టింది. నెగెటివ్ టాక్ రావడం కూడా దెబ్బకొట్టింది. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే సెకండ్ పార్ట్‌కు సగం కూడా కలెక్షన్స్ రాలేదు.
అక్వామెన్ 2 కథ ఇదే…
అక్వెమన్ క్యారెక్టర్ జోసన్ మోమోవాపై తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. యుద్ధంలో తన సోదరుడు ఓరమ్‌ను ఓడించిన అక్వామెన్ అలియాస్ అర్థర్ కర్రీ అట్టాంటిస్‌కు రాజు అవుతాడు. మోరాను పెళ్లిచేసుకొని సంతోషంగా జీవిస్తుంటాడు.
అక్వామెన్‌తో పగతో రగిలిపోయిన డేవిడ్ కేన్…బ్లాక్ ట్రైడెంట్ సహాయంతో కొత్త శక్తులను కూడగట్టుకొని అక్వామెన్‌పై తిరిగి యుద్ధానికి స్తాడు. డేవిడ్ కేన్‌ను అక్వామెన్ ఎలా ఎదుర్కొన్నాడు? డేవిడ్ కేన్ కొత్త శక్తుల ముందు అక్వామెన్ బలం సరిపోయిందా? ఈ పోరాటంలో అక్వామెన్‌కు అతడి సోదరుడు ఓరమ్ ఎలా అండగా నిలిచాడన్నదే అక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్ మూవీ కథ.
రివేంజ్ డ్రామా…
ఫస్ట్ పార్ట్‌లో కథ, కథనాలతో పాటు యాక్షన్ ఎమోషన్స్‌కు పెద్దపీట వేశారు మేకర్స్. సెకండ్ పార్ట్‌లో ఆ మ్యాజిక్ మిస్సయింది. కంప్లీట్ రివేంజ్ డ్రామాగా బోరింగ్ కథ సాగడం కూడా ఈ సీక్వెల్‌కు మైనస్‌గా మారింది. అక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్‌లో అంబర్ హెర్డ్, ప్రాట్రిక్ విల్సన్ కీలక పాత్రలు పోషించారు.