Saturday, October 26, 2024

Wake up: ఉదయం నిద్రలేవగానే వీటిని చూశారా ఇక మీకు రోజంతా బ్యాడ్ డే అవుతుంది

Wake up: ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఇంతకుముందు అయితే దేవుడికి దండం పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూనే కళ్ళు తెరుస్తున్నారు. నిద్ర లేవగానే ఫోన్ తీసుకుని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంటూ వీడియోలు చూస్తూ ఉంటారు. కానీ ప్రతిరోజు నిద్రలేవగానే ఈ పనులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. 

కొంతమంది నిద్రలేవగానే అరచేతులు రెండు రుద్దుకొని వాటిని చూసుకుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. అరచేతుల్లో అందరూ దేవతలు ఉంటారని నమ్ముతారు. ఇంకొంతమంది మంచం దిగేటప్పుడు భూదేవికి నమస్కరిస్తారు. ఇంకొందరు ఫోన్ లో దేవుడి ఫోటోలు వాల్ పేపర్ గా పెట్టుకుని చూసుకుంటారు. అయితే అసలు మనం ఉదయం లేవగానే ఇటువంటి వస్తువులు చూడకూడదు అనేది తెలుసుకుందాం.

నిద్రలేవగానే ఇవి చేయకండి 

నిద్ర లేవగానే విరిగిన అద్దంలోకి చూసుకోకూడదు. అలా చేసే ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆ రోజంతా చెడు ఫలితాలు ఎదురు అవుతాయి. అద్దం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీ వెంటే ఉంటుంది. ఏ పని చేసినా అది పూర్తి కాదు. ఆటంకాలు ఎదురవుతాయి. సమస్యలు మీ వెంటే ఉంటాయి. 

అలాగే అద్దంలో నిద్రపోతున్న వారి ప్రతిబింబాన్ని చూడకూడదు. మత విశ్వాసాల ప్రకారం వేరే మనిషి నీడను చూడకూడదు. ఇలా చేయడం వల్ల మీకు అననుకూల ఫలితాలు ఎదురవుతాయి.

నిద్ర లేవగానే చాలామందికి ఫోన్ చూసుకునే అలవాటు ఉంటుంది. అందులోనే ఏవైనా చెడు వార్తలు ఉంటే వాటిని చూడగానే ఆ రోజంతా మనసు ఆందోళనగా  ఉంటుంది. రోజంతా ఇబ్బంది పడతారు. మనసు కకావికలం అయి మనకు అలా జరుగుతుందేమో అనే భయంతో ఉంటారు. 

మురికిగా ఉన్న వంట పాత్రలు చూడకూడదు. మంచం చుట్టూ ఎంగిలి పాత్రలు అసలు పెట్టుకోకూడదు. ఎంగిలి పాత్రలు కిచెన్ లో ఉంచుకోకూడదు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభించవని అంటారు. అందుకే వంట పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

కత్తులు, కర్రలు, కత్తెరలు వంటి వస్తువులు నిద్రలేవగానే పొరపాటున కూడా చూడకండి. మంచిది కాదు. ఎందుకంటే ఇవి హింసను ప్రేరేపిస్తాయి. హింసాత్మక ఆలోచనలు మనసులో మెదులుతాయి. 

ఆవాలు అసలే చూడకూడదు. నలుపు రంగు ఆవాలు నెగటివ్ ఎనర్జీని తీసుకువచ్చే అవకాశం ఉంది. అలాగే ఆవాలు, నల్ల నువ్వులు శనికి చెందినవిగా భావిస్తారు. అందుకే శని ఆశీస్సులు లభించడం కోసం వీటిని ఎక్కువగా దానం చేస్తారు.

నలుపు రంగు వస్తువులు చూడకూడదు. నలుపు అపశకునంగా భావిస్తారు.  అందుకే నిద్ర లేవగానే నలుపు రంగు వస్తువులు చూడటం వల్ల కీడు జరుగుతుందని చెబుతారు. 

నిద్ర లేవగానే ఏం చేయాలి

ఉదయం నిద్ర లేవగానే ఆరోగ్యంగా ఉండేవిధంగా పనులు చేయాలి. యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిది. సూర్యరశ్మి తగిలే విధంగా రోజుకి ఒక అరగంట పాటు నడిస్తే శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుంది. పచ్చని వాతావరణం, ఇష్టమైన వారి మొహాలు చూడటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి. రోజంతా మీకు మంచే జరుగుతుంది. 

 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana