Tillu Sqaure Leaked Online: డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ ఆకాశమంత అంచనాల మధ్య తెరపైకి వచ్చింది. ఈ చిత్రం తెలుగులో మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అనుపమ పరమేశ్వరన్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో కనిపించింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన టిల్లు స్క్వేర్‌ను సినిమా 2024లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
టిల్లు క్యూబ్ మూవీ
నాన్-స్టార్, ప్రాంతీయ సినిమాగా వచ్చిన టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కల్ట్ మూవీగా అవతరించింది. మేకర్స్ ఇప్పుడు దాని సీక్వెల్ ‘టిల్లు క్యూబ్’ (Tillu Cube Movie) అనే మరో సీక్వెల్‌ను కూడా తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే, తాజాగా టిల్లు స్క్వేర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో టిల్లు స్క్వేర్ నేటి నుంచి అంటే ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, ఇక్కడే సినిమా నిర్మాతలకు పెద్ద షాక్ తగిలింది.
ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ
ఓటీటీలోకి వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా ఆన్‌లైన్ (Tillu Sqaure Online)లో లీక్ అయింది. ఈ సినిమా పూర్తిగా ఫుల్ హెచ్‌డీ (HD Quality) క్వాలిటీలో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంది. లోతుగా పాతుకుపోయిన పైరసీ మాఫియా ప్రభావానికి టిల్లు స్క్వేర్ బలైనట్లు తెలుస్తోంది. టిల్లూ స్క్వేర్ సినిమాలోని కంటెంట్ మొత్తాన్ని కాపీ చేసి లింక్‌ల రూపంలో ఇంటర్నెట్‌లో షేర్ చేశారు. వినియోగదారులు చూడటానికి మరియు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ లింక్‌లు ఇప్పుడు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.
పెద్ద షాకే ఇది
కోట్ల ఖర్చు పెట్టి టిల్లు స్క్వేర్ సినిమాను కొనుక్కున్న నెట్‌ఫ్లిక్స్‌కు (Netflix OTT) ఇది పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఇలాంటి క్రేజీ సినిమాలు పసారం అయితే సదరు ఓటీటీలకు సబ్ స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వ్యూయర్ షిప్ ఎక్కువగా ఉన్న ఓటీటీలుగా (OTTs) నిలుస్తాయి. కానీ, వాటికి ఆస్కారం లేకుండా ఆన్‌లైన్‌లో సినిమాలు లీక్ కావడం ఓటీటీలకు పెద్ద నష్టంగా మారింది.
అనేక చిత్రాలు లీక్
ప్రస్తుతానికి అయితే, ఐ బొమ్మ (Ibomma) వంటి సైట్‌లలో ఓటీటీలోకి వచ్చిన కొత్త తెలుగు సినిమాలు లీక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ అనేక చిత్రాలు ఇందులో లీక్ అయ్యాయి. తాజాగా వాటి జాబితాలో టిల్లు స్క్వేర్ కూడా నిలిచింది.
బోల్డ్ లుక్‌లో అనుపమ
కాగా టిల్లు స్క్వేర్ సీక్వెల్‌లో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి కల్లెం వంటి ఇతర నటీనటులు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. ఇక లిల్లీ పాత్ర పోషించిన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) బోల్డ్ లుక్‌లో కనిపించడమే కాకుండా సూపర్ హాట్ సీన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా కారులో, బెడ్ రూమ్ సీన్స్‌లో అనుపమ-సిద్ధు జొన్నలగడ్డ కెమిస్ట్రీ నెక్ట్ లెవెల్ ఉందని టాక్ వచ్చింది.