Home ఎంటర్టైన్మెంట్ Sahya First Look: మైథ‌లాజిక‌ల్ మూవీ స‌హ్య ఫ‌స్ట్ లుక్ రిలీజ్ – హీరోయిన్‌గా ఎంట్రీ...

Sahya First Look: మైథ‌లాజిక‌ల్ మూవీ స‌హ్య ఫ‌స్ట్ లుక్ రిలీజ్ – హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న‌ భీమ్లానాయ‌క్ న‌టి!

0

Sahya First Look: ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లానాయ‌క్ మూవీలో పోలీస్ కానిస్టేబుల్ పాత్ర‌లో చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది మౌనిక రెడ్డి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మూవీతో తెలుగునాట క్రేజ్‌ను సంపాదించుకున్న మౌనిక రెడ్డి తాజాగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. స‌హ్య పేరుతో ఓ మైథ‌లాజిక‌ల్ మూవీ చేస్తోంది. ఈ సినిమాతో యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతోన్నారు.

ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌…

స‌హ్య మూవీ ఫస్ట్ లుక్ ను సీనియ‌ర్ హీరో అర్జున్ విడుదల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో క‌త్తి ప‌ట్టుకొని ఓ యోధురాలిగా మౌనిక‌రెడ్డి క‌నిపిస్తోంది. ఆమె చేతుల‌తో పాటు దుస్తుల‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉండటం ఆస‌క్తిని పంచుతోంది. అర్జున్ మాట్లాడుతూ… “కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న సహ్య సినిమా పోస్టర్, టైటిల్ అద్భుతంగా గా ఉన్నాయి, మంచి కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతోన్న ఫీమేల్ లీడ్ సినిమాలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఆ సినిమాల జాబితాలో స‌హ్య చేరాల‌ని ఆకాంక్షించారు.

త్వ‌ర‌లో ట్రైల‌ర్‌…

మైథ‌లాజిక‌ల్ యాక్ష‌న్ అంశాల‌తో స‌హ్య మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లో స‌హ్య టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్నారు. ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్‌లో మౌనిక రెడ్డి క‌నిపించ‌బోతున్న‌ది. ఆమె క్యారెక్ట‌ర్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని, హీరోయిన్‌గా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతోంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.

బ‌ల‌గం ఫేమ్‌…

బలగం, రాజాకర్ సినిమాల ఫేమ్‌ సంజయ్ కృష్ణ సహ్య సినిమాలో హీరోగా క‌నిపించ‌బోతున్నాడు. రవీందర్ రెడ్డి, సుమన్, భాను, నీలేష్, ప్రశాంత్ తదితరులు ఈ మూవీలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి అరుణ్ కోలుగురి సినిమాటోగ్రఫీ, రోహిత్ జిల్లా సంగీతం సమకూరుస్తున్నారు.సుధా క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ జుకంటి, భాస్కర్ రెడ్డిగారి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

భీమ్లానాయ‌క్ త‌ర్వాత‌…

యూట్యూబ్‌లో ప‌లు షార్ట్‌ఫిలిమ్స్ చేసింది మౌనిక రెడ్డి. వాటి ద్వారా వ‌చ్చిన గుర్తింపుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి క్యూట్ అబ్బాయి నాటు, సూర్య వెబ్‌సిరీస్‌లు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. వాటి ద్వారానే భీమ్లానాయ‌క్‌లో అవ‌కాశం సొంతం చేసుకున్న‌ది. భీమ్లానాయ‌క్ త‌ర్వాత తెలుగులో ఓరి దేవుడా, బేబీ, 18 పేజేస్ సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేసింది. ఓ వైపు వెబ్‌సిరీస్‌లు చేస్తూనే సినిమాల్లో న‌టిస్తోంది.ఓ వైపు వెబ్‌సిరీస్‌లు చేస్తూనే సినిమాల్లో న‌టిస్తోంది.

విడాకుల పుకార్లు…

2022 డిసెంబ‌ర్‌లో ప్రియుడిని ప్రేమించి పెళ్లిచేసుకున్న‌ది మౌనిక రెడ్డి. పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు చేస్తోంది. ఇటీవ‌ల భ‌ర్త‌తో దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియా నుంచి డిలిట్ చేయ‌డంలో ఆస‌క్తిక‌రంగా మారింది. ఆమె విడాకులు తీసుకోబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విడాకుల పుకార్ల‌పై మౌనిక రెడ్డి మాత్రం స్పందించ‌లేదు.

2022 డిసెంబ‌ర్‌లో ప్రియుడిని ప్రేమించి పెళ్లిచేసుకున్న‌ది మౌనిక రెడ్డి. పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు చేస్తోంది.

Exit mobile version