Wednesday, January 15, 2025

Ranveer Alia ad: శోభనం గదిలో రణ్‌వీర్, ఆలియా.. నాకిదే తొలిసారి అంటూ.. ఫన్నీ యాడ్ వైరల్

Ranveer Alia ad: బాలీవుడ్ తెరపై బెస్ట్ కపుల్స్ లో ఒకటి రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జోడీ. నిజ జీవితంలో దీపికను రణ్‌వీర్, రణ్‌బీర్ ను ఆలియా పెళ్లి చేసుకున్నా.. స్క్రీన్ పై మాత్రం వీళ్ల జోడీకి చాలా మందే అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఓ యాడ్ లో నటించారు. శోభనం గదిలో కూర్చొని వీళ్లు చెప్పే డైలాగ్స్, క్యూట్ లుక్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

రణ్‌వీర్, ఆలియా యాడ్

రణ్‌వీర్, ఆలియా భట్ ఇప్పటికే గల్లీ బాయ్, రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీలాంటి సినిమాల్లో నటించారు. ఈ రెండూ సూపర్ హిట్ అయ్యాయి. స్క్రీన్ పై వీళ్ల కెమెస్ట్రీ ఫ్యాన్స్ కు కూడా బాగా నచ్చింది. ఇక ఇప్పుడు వీళ్లు కలిసి చేసిన ఓ యాడ్ కూడా వైరల్ అయింది. మేక్ మై ట్రిప్ కోసం చేసిన ఈ యాడ్ లో రణ్‌వీర్, ఆలియా కొత్తగా పెళ్లయిన జంటగా కనిపించడం విశేషం.

శోభనం గదిలో మంచంపై కూర్చున్న ఆలియా దగ్గరికి రణ్‌వీర్ వస్తాడు. నాకిదే తొలిసారి అని ఆమెతో అంటాడు. దానికి ఆలియా స్పందిస్తూ తనకు కూడా ఇదే తొలిసారి అంటుంది. అయితే టెన్షన్ పడకు ఈజీగానే అయిపోతుంది అని ధైర్యం చెబుతుంది. ఇది ప్రయాణమే కానీ గమ్యం కాదు కదా అని రణ్‌వీర్ అంటాడు. అయితే మొదలు పెడదామా అని ఆలియా అంటుంది.

ఈ డైలాగ్స్ చూసి అందరూ ఏం ఊహించుకుంటారో అర్థం చేసుకోవచ్చు. కానీ అక్కడే యాడ్ లో అసలు ట్విస్ట్ వస్తుంది. వెంటనే ఆలియా తన మొబైల్ తీస్తూ.. అయితే నేను మేక్ మై ట్రిప్ లో ప్యారిస్ హనీమూన్ కు ఫ్లైట్స్ చూస్తాను అనగానే.. నేను హోటల్స్ చూస్తాను అని రణ్‌వీర్ అంటాడు. తొలిసారి ఇంటర్నేషనల్ జర్నీ చేసే వారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటూ యాడ్ ముగుస్తుంది.

క్యూట్ కపుల్

ఈ యాడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రణ్‌వీర్, ఆలియా కెమెస్ట్రీ ఎంత బాగుందో.. వీళ్లు మరో సినిమా చేయాలి అంటూ కామెంట్స్ చేశారు. బెస్ట్ కెమెస్ట్రీ, చాలా క్యూట్ గా ఉంది, ఇది కూడా బోల్డ్ కేర్ యాడ్ అనుకున్నారా అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేయడం విశేషం. ఈ మధ్యే అడల్ట్ ఫిల్మ్ స్టార్ జానీ సిన్స్ తో కలిసి రణ్‌వీర్ చేసిన సెక్సువల్ హెల్త్ కేర్ యాడ్ ను కొందరు గుర్తు చేసుకున్నారు.

గంగూబాయి కఠియావాడి మూవీ కోసం నేషనల్ అవార్డు అందుకున్న ఆలియా భట్.. గతేడాది రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని మూవీలో కనిపించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాది ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ సరసన ఆలియా నటించింది. ఇక రణ్‌వీర్ ఈ ఏడాది సింగం అగైన్ మూవీతో వస్తున్నాడు. ఇందులో అతని భార్య దీపికా పదుకోన్ కూడా నటిస్తోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana