Home అంతర్జాతీయం CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

0

CBSE results 2024 date : సీబీఎస్​ఈ 10వ తరగతి పరీక్షల ఫలితాలు, సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాల కోసం విద్యార్థుల నిరీక్షణ కొనసాగుతోంది. ఫలితాల విడుదలపై సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్జ్యుకేషన్​ సీబీఎస్​ఈ.. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. త్వరలోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పాత ట్రెండ్స్​ని పరిశీలిస్తే.. సీబీఎస్​ఈ ఫలితాలు.. ఏప్రిల్​- మేలో విడుదలవుతాయి. డేట్​, టైమ్​ వివరాలను సీబీఎస్​ఈ ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీబీఎస్​ఈ క్లాస్​ 10, క్లాస్​ 12 ఫలితాలకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సీబీఎస్​ఈ ఫలితాలు 2024- ఈ వెబ్​సైట్స్​లో చెక్​ చేసుకోండి..

సీబీఎస్​ఈ 10, 12 తరగతుల ఫలితాలను చెక్​ చేసుకునేందుకు పలు వెబ్​సైట్స్​ ఉన్నాయి. అవి..

cbseresults.nic.in

results.cbse.nic.in

CBSE 10th result 2024 date : cbse.nic.in

digilocker.gov.in

results.gov.in.

మొబైల్​ యాప్స్​:- డిజీలాకర్​, ఉమంగ్​.

సీబీఎస్​ఈ ఫలితాలు 2024- ఇలా చెక్​ చేసుకోండి..

డిజీలాకర్​లో సీబీఎస్​ఈ ఫలితాలు ఎలా చెక్​ చేసుకోవాలో ఇక్కడ చూడండి..

స్టెప్​ 1:- డిజీలాకర్​ యాప్​ లేదా వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- అకౌంట్​ ఉంటే సైన్​-ఇన్​ చేసుకోండి. లేకపోతే అకౌంట్​ క్రియేట్​ చేసుకోండి.

CBSE 12th result 2024 date : స్టెప్​ 3:- హోం పేజ్​లోకి వెళ్లి.. సీబీఎస్​ఈ రిజల్ట్స్​ లింక్​ కోసం చూడండి. దాని మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 4:- సంబంధిత వివరాలను సబ్మీట్​ చేయండి. స్కోర్​ డిస్​ప్లే అవుతుంది.

ప్రొవిజనల్​ మార్క్​షీట్​ని ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

స్టెప్​ 1:- results.cbse.nic.in లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- క్లాస్​ 10 లేదా క్లాస్​ 12 ఫలితాల పేజ్​లోకి వెళ్లండి.

CBSE results 2024 latest news : స్టెప్​ 3:- మీ సమాచారాలను సబ్మీట్​ చేయండి.

స్టెప్​ 4:- సీబీఎస్​ఈ రిజల్ట్​ని చెక్​ చేసుకుని డౌన్​లోడ్​ చేసుకోండి.

ఈ ఏడాది.. సీబీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చ్​ 13 వరకు జరిగాయి. క్లాస్​ 12 పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్​ 2 వరకు జరిగాయి. సింగిల్​ షిప్ట్​లోనే ఈ రెండు తరగతుల పరీక్షలను నిర్వహించారు. సీబీఎస్​ఈ క్లాస్​ 10, క్లాస్​ 12 పరీక్షల కోసం 39 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్​ చేసుకున్నారు.

CBSE latest news : సీబీఎస్​ఈ 10, 12 ఫలితాలు 2024 అప్డేట్స్​ కోసం హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుని ఫాలో అవ్వండి. సీబీఎస్​ఈ ఫలితాలకు సంబంధించిన డేట్​, టైమ్​ వివరాలు బయటకు వచ్చిన వెంటనే.. మేము మీకు అప్డేట్​ చేస్తాము.

Exit mobile version