Sunday, October 27, 2024

AP Open School Results: ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్ 2024 ఫలితాల విడుదల

AP Open School Results: ఏపీ Open School

ఓపెన్‌ స్కూల్ SSC, ఇంటర్మీడియట్ (APOSS) పబ్లిక్ పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి-2024లో నిర్వహించిన Exam Resultsపరీక్షల ఫలితాలను కమిషనర్ విడుదల చేశారు.

SSC, Intermediate ఇంటర్మీడియట్ (APOSS) పబ్లిక్ పరీక్షలు, ఈ ఏడాది మార్చి 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్ని మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించారు. స్పాట్ వాల్యుయేషన్ ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 16వరకు నిర్వహించారు.

SSC పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 32,581 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 73,550 మంది హాజరయ్యారు. SSC, ఇంటర్మీడియట్ (APOSS) పబ్లిక్ పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ గురువారం విడుదల చేశారు. https://apopenschool.ap.gov.in/

ఫలితాలు APOSS అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఏపీ ఓపెన్ స్కూల్ ఫలితాల కోసం ఈ లింకును అనుసరించండి. https://apopenschool.ap.gov.in/

పదోతరగతి పరీక్షలకు SSC మొత్తం 32,581 మంది హాజరు కాగా వారిలో 18,185 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 55.81గా ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 73,550 మంది హాజరు కాగా 48,377 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణతా శాతం 65.77గా ఉంది.

⦁ SSC బాలురిలో 53.98% ఉత్తీర్ణత, బాలికల్లో 57.92% ఉత్తీర్ణత నమోదైంది.

⦁ ఇంటర్మీడియట్ బాలురిలో 65.43% ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్ బాలికలలో : 66.35% ఉత్తీర్ణత నమోదైంది.

SSC & ఇంటర్మీడియట్ అత్యధిక/అత్యల్ప ఉత్తీర్ణత శాతం జిల్లాలు

⦁ SSC అత్యధిక ఉత్తీర్ణత శాతం జిల్లా : తూర్పు గోదావరి (92.24 %)

⦁ SSC అత్యల్ప ఉత్తీర్ణత శాతం జిల్లా : ఏలూరు (06.90 %)

⦁ SSC బాలురు అత్యధిక ఉత్తీర్ణత శాతం జిల్లా : తూర్పు గోదావరి (91.48 %)

⦁ SSC బాలికల అత్యధిక ఉత్తీర్ణత శాతం జిల్లా : తూర్పు గోదావరి (93.30 %)

⦁ ఇంటర్మీడియట్ అత్యధిక ఉత్తీర్ణత శాతం జిల్లా : తిరుపతి (87.40 %)

⦁ ఇంటర్మీడియట్ అత్యల్ప ఉత్తీర్ణత శాతం జిల్లా : విశాఖపట్నం (22.88 %)

⦁ ఇంటర్మీడియట్ బాలురు అత్యధిక ఉత్తీర్ణత శాతం జిల్లా. : తిరుపతి (87.68 %)

⦁ ఇంటర్మీడియట్ బాలికల అత్యధిక ఉత్తీర్ణత శాతం జిల్లా. : తిరుపతి (86.92 %)

రీ వాల్యుయేషన్ ఇలా…

⦁ SSC & ఇంటర్మీడియట్ అభ్యర్థులు రీకౌంటింగ్ మరియు స్కాన్ చేసిన కాపీ మరియు విలువైన జవాబు స్క్రిప్ట్‌ల రీ-వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి మే 5వ తేదీ వరకు గడువు ప్రకటించారు.

రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం ఏప్రిల్ 29 నుంచి మే 7వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ మరియు రీ-వెరిఫికేషన్ కోసం, జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీని పొందడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్” కేంద్రాలలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

ఓపెన్ స్కూల్ SSC & ఇంటర్మీడియట్ (APOSS) పబ్లిక్ పరీక్షలు జూన్‌ 1 నుంచి జూన్ 8వరకు జరుగుతాయి. పరీక్షలు మధ్యాహ్నం సెషన్‌లో 02.30 PM నుండి 05.30 PM వరకు జరుగుతాయి.

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు 10.06.2024 నుండి 12.06.2024 వరకు జరుగుతాయి.

సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ 29.04.2024 నుండి 10.05.2024 వరకు ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ లింకును ఫాలో అవ్వండి. https://apopenschool.ap.gov.in/

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana