posted on Apr 26, 2024 4:05PM
డోన్ నియోజకవర్గం వైైసీసీ అభ్యర్థి మంత్రి బుగ్గన నామినేషన్ పెండింగ్లో పడింది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో ఉంచారు.
బుగ్గన తన నామినేషన్ లో పులు ఆస్తుల వివరాలను పొందుపరచలేదని తెలుగుదేశం అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ తరఫు న్యాయవాదులు ఆర్వో దృష్టికి తీసుకురావడంతో ఆయన ఈ సాయంత్రంలోగా సమాధానం ఇవ్వాలని బుగ్గనకు నోటీసులు జారీ చేస్తూ నామినేషన్ ను పెండింగ్ లో ఉంచారు.
అయితే అలా నామినేషన్ ను పెండింగ్ లో ఉంచడం నిబంధనలకు విరుద్ధమంటూ న్యాయవాదులు అభ్యంతరం చెబుతున్నారు.