Home తెలంగాణ ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీకి 3 సీట్లు వ‌స్తే, ముద్ర‌గ‌డ ఇంట్లో అంట్లు తోముతా | YSRCP defeat...

ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీకి 3 సీట్లు వ‌స్తే, ముద్ర‌గ‌డ ఇంట్లో అంట్లు తోముతా | YSRCP defeat in North Andhra

0

posted on Apr 26, 2024 6:03PM

ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం స్టార్ట్ అయింది.  ప్ర‌చారంలో ప్రధాన పార్టీల నేత‌లు మాట‌ల‌ ప‌దును పెంచుతున్నారు. రాజ‌కీయ స‌వాళ్ళు, ప్ర‌తిస‌వాళ్ళ‌తో నేత‌లు, ఓట‌ర్ల‌ను వినోదాన్ని పంచుతున్నారు. “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు. టీడీపీ నేటిజన్లు జగన్ బ్యాండేజ్ సైజు పెరిగిందంటూ పోస్టులు పెడుతున్నారు. జగన్ ఇకపై ఆ బ్యాండేజ్ తీసేస్తేనే బెటర్, లేకపోతే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందని  వైఎస్ వివేకా కుమార్తె సునీత ట్వీట్ చేశారు.

ఇదే విషయం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ట్విట్టర్ లో స్పందించారు. “2014, 2019 ఎన్నికల్లో శవరాజకీయాలతో నెట్టుకొచ్చిన జగన్… ఈసారి ఒక డ్రామాతో వచ్చాడు. కనపడని ఒక గులకరాయి తగిలిందంట. బ్యాండ్ వేసాడు. రోజురోజుకు ఆ బ్యాండ్ పెద్దదవుతోంది. మే 13 ఎన్నికల రోజు వరకు డ్రామా ఆడిస్తానే ఉంటాడు ఈ నాటకాల రాయుడు” అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు! 

మరోపక్క టీడీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు. ఈ నెల 13న బ్యాండేజ్ సైజు చిన్నగా ఉంది.. ప్రస్తుతం అది పెద్దగా అయ్యింది అంటూ… “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు.

అయితే నేను వున్నాను. న‌న్ను గుర్తించండి అంటూ థర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, టాలీవుడ్ న‌టుడు పృథ్వీ రాజ్ ఓ ఛాలెంజ్ విసిరారు. జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ ముద్ర‌గ‌డ‌ను ల‌క్ష్యంగా  చేసుకొని ఆయ‌న విమ‌ర్శ‌లు చేసారు.  ముద్రగడ కాపు ఉద్య‌మ నాయ‌కుడిగా ప్ర‌స్థానం ప్రారంభించి, ఇప్పుడు రెడ్డి ఉద్య‌మ నాయ‌కుడిగా, రెడ్డి సేవ‌కుడిగా మారార‌ని ఆరోపించారు. 

కిర్లంపూడి లో కూర్చుని క‌బుర్లు చెబుతున్న ముద్ర‌గ‌డ‌ త‌న ప‌రిశ్ర‌మ‌ల‌కు, రైస్ మిల్లుల‌కు ఉన్న విద్యుత్ బ‌కాయిలు ఎంతో చెప్పాల‌ని ఆయన డిమాండ్ చేశారు. ఉత్త‌రాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ కనీసం మూడు సీట్లు కూడా గెలిచే ప‌రిస్థితి లేద‌న్నారు. ఒక‌వేళ మూడు సీట్లు వైసీపీ గెలిస్తే మాత్రం నేను ఆయన ఇంట్లో అంట్లు తోముతాన‌ని అన్నారు.  ప్రస్తుతం ముద్ర‌గ‌డను ప‌ట్టించుకునేవారు, న‌మ్మేవారు ఎవ‌రూ లేర‌ని పృథ్వీ గట్టిగా చెబుతున్నారు. మెగా కుటుంబంలో చిరంజీవి, రామ్‌చరణ్ స‌హా ప‌లువురు కూటమికి మద్దతుగా ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లోనే రాబోతున్నాట‌. అలాగే సీఎం జ‌గ‌న్‌పై కూడా పృథ్వీ విమ‌ర్శ‌లు చేసారు. అయితే దీనిపై వైసీపీ నాయ‌కులు స్పందించారు.  ఉత్తరాంద్ర లో వైసీపీ గెలవడం పక్కా అని,  తాను చెప్పినట్లు అంట్లు తోమాడానికి గిన్నెలు కూడా రెడీగా ఉన్నాయని వైసీపీ నాయకులు అంటున్నారు.

– ఎం.కె.ఫ‌జ‌ల్‌

Exit mobile version