2023 తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో(TS Inter Results 2023) బాలికలదే హవా. అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4 లక్షల 33 వేల 82 మంది హాజరు కాగా వీరిలో 2,72,208 మంది పాస్ అయ్యారు. మొదటి సంవత్సరంలో మొత్తం 63.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,60,000 మంది ఏ గ్రేడ్‌లో పాస్ కాగా, 68,335 మంది బి గ్రేడ్‌లో పాస్ అయ్యారు. బాలికలు 68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 56.82 శాతం మంది పాస్ అయ్యారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లాకు మొదటి స్థానం, రెండో స్థానం రంగారెడ్డి జిల్లాకు దక్కిందిసెకండియర్ ఫలితాలలో ములుగు జిల్లాకు మొదటి స్థానం, ద్వితీయ స్థానం కొమురం భీమ్ జిల్లాకు, మూడో స్థానంలో మేడ్చల్ జిల్లాలు నిలిచాయి.