Wednesday, October 30, 2024

OTT: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Manjummel Boys OTT Release: సినీ ప్రియులు డిఫరెంట్ జోనర్లను ఇష్టపడుతుంటారు. వాటిలో సర్వైవల్ థ్రిల్లర్స్ ఒకటి. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రధాన పాత్రలు చేసే పోరాటంతో ఈ జోనర్స్ ఉంటాయి. వాటిని ఎంత ఎంగేజింగ్‌గా ఆసక్తిగా తెరకెక్కిస్తే అంతకుమించి సక్సెస్ అందుకుంటాయి. అలా ఇటీవల భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీనే మంజుమ్మల్ బాయ్స్.

ప్రత్యేక ఆకర్షణ

మలయాళ సినిమాకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ఈ పరిశ్రమ నుంచి అనేక చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. ఇటీవల ప్రేమలు (Premalu Movie) సినిమా బాటలోనే మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది మంజుల బాయ్స్. ఫిబ్రవరి 22న కేరళలో విడుదలైన ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. తొలి రోజు నుంచే మంచి టాక్‌తో కలెక్షన్స్ అదరగొట్టింది.

234 కోట్లకుపైగా కలెక్షన్స్

ప్రపంచవ్యాప్తంగా రూ. 234 కోట్లకుపైగా వసూలు చేసిన తొలి మలయాళ చిత్రంగా మంజుమ్మల్ బాయ్స్ చరిత్ర సృష్టించింది. 2006లో జరిగిన ఓ యదార్థ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని కొచ్చికి చెందిన ఓ స్నేహితుల కథతో తెరకెక్కిన మలయాళ సర్వైవల్ థ్రిల్లరే ‘మంజుమ్మల్ బాయ్స్’. చిదంబరం ఎస్ పొడువల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రల్లో నటించారు.

తెలుగు వెర్షన్ కూడా

మలయాళ ప్రేక్షకులను తమ నటనతో మెప్పించి విశేషమైన విజయాన్ని అందుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమా తెలుగు వెర్షన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏప్రిల్ 6న విడుదల అయింది. టిల్లు స్క్వేర్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాల పోటీ ఉన్నప్పటికీ మంచి కలెక్షన్స్ సాధించింది మంజుమ్మల్ బాయ్స్.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేయనుంది. ఏప్రిల్ 6 నుంచే మలయాళ వెర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని చాలా రోజుల నుంచి వార్తలు వచ్చాయి. కానీ, అలా జరగలేదు. ఇప్పుడు మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) చేజిక్కించుకుంది.

మే 3 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మంజుమ్మల్ బాయ్స్ సినిమాను మే 3 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్స్ వెలువడ్డాయి. అంతేకాకుండా ఈ సినిమాను మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. అంటే ఒకేసారి ఐదు భాషల్లో ఓటీటీలో మంజుమ్మల్ బాయ్స్ స్ట్రీమింగ్ కానుంది.

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ

థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో ఎంచక్కా ఫ్యామిలీ కలిసి చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాగా ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుని సమ్మర్ స్పెషల్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.

గుణ కేవ్స్‌లో

పరవ ఫిలిమ్స్ పతాకంపై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోనీ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి తెలుగులో విడుదల చేశారు. 2006లో కొడైకెనాల్‌లోని గుణ కేవ్స్‌లో చిక్కుకున్న స్నేహితుడిని రక్షించిన ఎర్నాకుళంలోని మంజుమ్మల్‌కు చెందిన యువకుల నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana