Guppedantha Manasu Today Episode: మను తండ్రి ఎవరన్నది తెలుసుకోవాలని వసుధార బలంగా ఫిక్సవుతుంది. అనుపమతో ఎమోషనల్‌గా మాట్లాడి ఆమె నుంచి సమాధానం రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది. మను తండ్రి చనిపోయారా అని అనుపమను అడుగుతుంది వసుధార.
మను తండ్రి చనిపోయాడు కాబట్టే అతడి గురించి మీరు చెప్పడం లేదా అని నిలదీస్తుంది. వసుధార మాటలను అనుపమ తట్టుకోలేకపోతుంది. నిజానిజాలు తెలియకుండా మరో వ్యక్తి గురించి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అని వసుధారపై అనుపమ ఫైర్ అవుతుంది.
అనాథ కాదంటే…
మను అనాథ కాదని మీరే అంటున్నారు…అనాథ కానప్పుడు తండ్రి లేడంటే అతడు చనిపోయాడనే కదా అని అర్థం అని వసుధార లాజిక్‌లు మాట్లాడుతుంది. మను తండ్రి బతికే ఉన్నాడని పెద్దమ్మ సమాధానమిస్తుంది. అమె అక్కడికి సడెన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో వసుధారతో పాటు అనుపమ షాకవుతుంది.
ఇంకోసారి మను తండ్రి చనిపోయాడని అంటే బాగుండదని వసుధారతో పెద్దమ్మ అంటుంది. పెద్దమ్మ ఎక్కడ నిజం చెబుతుందో అని అనుపమ ఆమెను ఆపేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే నన్ను ఆపి చాలా పెద్ద తప్పు చేశావు. నీ మాటకు కట్టుబడి ఇన్నాళ్లు మౌనంగా ఉండి నేను తప్పు చేశానని పెద్దమ్మ బదులిస్తుంది.
మహేంద్రనే మను తండ్రి…
మను తండ్రి స్థానంలోకి వేరే బయటివ్యక్తి వస్తున్నాడు..ఇలాంటి సమయంలో కూడా మను తండ్రి గురించి మీరు చెప్పడం లేదంటే నిజంగానే అతడు చనిపోయి ఉంటాడని మరోసారి వసుధార అంటుంది. మను తండ్రి చనిపోయాడని వసుధార పదే పదే అనడం అనుపమ, పెద్దమ్మ సహించలేకపోతారు.
మను తండ్రి స్థానంలోకి బయటివాళ్లు ఎవరో వస్తున్నారని నువ్వు ఫీలవుతున్నావు, నువ్వు అంత ఫీలవ్వాల్సిన అవసరం లేదని వసుధారతో అంటుంది పెద్దమ్మ. మను కన్న తండ్రే ఆ స్థానంలోకి వస్తున్నాడు. మను స్వంత తండ్రి అతడిని దత్తత తీసుకోబోతున్నాడని రహస్యాన్ని బయటపెట్టేస్తుంది పెద్దమ్మ. ఆమె మాటలతో వసుధార షాకవుతుంది. మను మహేంద్ర కొడుకు అనే నిజాన్ని బయటపెడుతుంది పెద్దమ్మ.
విధి ఆడిన నాటకం…
జరిగిన దాంట్లో అనుపమ తప్పేం లేదని, విధి ఆడిననాటకంలో అనుపమ బలైందని పెద్దమ్మ అంటుంది. పెద్దమ్మ మాటలను వసుధార నమ్మలేకపోతుంది. నిజం కాదేమోనని సందేహపడుతుంది. మను…మహేంద్ర కొడుకు అన్నది ముమ్మాటికి నిజం అని పెద్దమ్మ అంటుంది. అవసరమైతే డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకోమని చెబుతుంది.
మహేంద్ర ఎంట్రీ… అప్పుడే అక్కడికి మహేంద్ర వస్తాడు. ఏంటి ఆ నిజం అని ముగ్గురిని అడుతాడు. వసుధార నిజం బయటపెట్టేస్తుంది. కానీ మహేంద్ర ఆమె మాటలను సరిగా అర్థం చేసుకోలేకపోతాడు. వారు దత్తత గురించి మాట్లాడుతున్నారని పొరపడతాడు. మను తండ్రిని నేనే అని కాలేజీ అందరి ముందు ప్రకటించానని, ఇందులో కొత్తేం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
దేవయాని అసహనం…
మనును మహేంద్ర దత్తత తీసుకోవడం దేవయాని, శైలేంద్ర భరించలేకపోతారు. ముక్కుమొహం తెలియని మనును మహేంద్ర ఎలా దత్తత తీసుకుంటున్నాడు, అతడికి కొంచెం కూడా బుద్ధిలేదు అంటూ మహేంద్రపై ఫైర్ అవుతుంది దేవయాని. తమ్ముడిని తన ముందే దేవయాని తిట్టడం ఫణీంద్ర సహించలేకపోతాడు. మాటలు జాగ్రత్తగా మాట్లాడమని దేవయానికి వార్నింగ్ ఇస్తాడు.
ఈ దత్తత కార్యక్రమం జరిగితే మన కుటుంబం పరువు మొత్తం పోతుందని గొడవపడుతుంది. మహేంద్ర చేసింది తప్పే అంటూ భర్తతో వాదిస్తుంది. రిషి దూరమై పుట్టెడు దుఃఖంలో ఉన్న మహేంద్ర జీవితంలోకి మను వచ్చాడు…కొడుకుగా అతడికి అండగా నిలిచాడు. అందుకే మనును తాను దత్తత తీసుకుంటున్నానని మహేంద్ర అన్నాడుగా…మహేంద్ర చేస్తున్న పనిలో తప్పేం లేదని ఫణీంద్ర భార్యకు ఆన్సర్ ఆస్తాడు.
రిషి గురించి ఆలోచించకుండా…
తన ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో మాట మారుస్తుంది దేవయాని. మహేంద్ర కన్న కొడుకు రిషిని గురించి పట్టించుకోకుండా మను గురించి ఆలోచిస్తున్నాడని, వసుధార కూడా రిషి ఊసు ఎత్తడం లేదని అంటుంది. మూడు నెలల్లో రిషిని తీసుకొస్తానని అన్న మాటే వసుధార మర్చిపోయిందని అంటుంది.
రిషి గురించి వాళ్లు ఆలోచించడం, అతడి గురించి వెతకడం లేదని నీకు తెలుసా అని దేవయానిని అడుగుతాడు ఫణీంద్ర. రిషి గురించి వసుధారతో పాటు తాను వెతుకుతున్నానని ఫణీంద్ర అంటాడు. కానీ రిషి జాడ దొరకడం లేదని చెబుతుంది. త్వరలోనే అతడు తిరిగి వస్తాడని ఫణీంద్ర బదులిస్తాడు.
దత్తత గురించి రిషికి తెలిస్తే అతడు బాధపడతాడని, రిషి కోసమైనా ఈ దత్తతను ఆపేయమని భర్తతో అంటుంది దేవయాని. దత్తతను ఆపాల్సిన పని లేదని ఫణీంద్ర బదులిస్తాడు.
ఫణీంద్ర వార్నింగ్…
ఈ దత్తత కార్యక్రమానికి తాము రామని భర్తతో అంటుంది దేవయాని. మనును మహేంద్ర దత్తత తీసుకోవడం వెనుక ఏ మర్మం ఉందో…ఆస్తిని మనుకు రాసి ఇవ్వాలని అనుకుంటున్నాడో, కాలేజీకి అతడిని ఎండీని చేయాలని అనుకుంటున్నాడో…లేదంటే ఇంకేదైనా మతలబు ఉందోనని అవమానకరంగా మాట్లాడుతుంది. ఆమె మాటలతో ఫణీంద్ర కోపం పట్టలేకపోతాడు. ఇంకో మాట మాట్లాడితే బాగుండదని దేవయానికి వార్నింగ్ ఇస్తాడు. రేపు మనం దత్తత కార్యక్రమానికి వెళుతున్నామని, ఇది ఫైనల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
శైలేంద్ర ప్లాన్…
ఎలాగైనా ఈ దత్తతను ఆపమని శైలేంద్రతో చెబుతుంది దేవయాని. తల్లి చెప్పినట్లుగానే చేయాలని శైలేంద్ర ఫిక్సవుతాడు. మహేంద్రకు ఫోన్‌చేస్తాడు. తాను చెప్పిన ప్లేస్‌కు వస్తే నీకు మంచి జరుగుతుందని అంటాడు. నీ ఫోన్ లిఫ్ట్ చేయడానికే నా మనసు అంగీకరించలేదని, ఇంకా నువ్వు చెప్పిన చోటుకు ఎలా వస్తానని ఫోన్ కట్ చేయబోతాడు మహేంద్ర.
కష్టపడి తాను చెప్పిన చోటుకు మహేంద్రరావడానికి ఒప్పిస్తాడు శైలేంద్ర. మను మహేంద్ర కొడుకు అని పెద్దమ్మ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తుంటుంది. అసలు ఏం జరిగిందో పెద్దమ్మను అడిగి తెలుసుకోవాలని వసుధార అనుకుంటుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.