Tuesday, February 4, 2025

Gold and silver prices today : ఆల్​ టైమ్​ హై నుంచి దిగొచ్చిన పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే!

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 67,540కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 67,550గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,75,400కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,754గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 73,680కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,690గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,36,800గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,368గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,690గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,830గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,540 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,680గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,440గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,660గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,540గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,680గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,540గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,680గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,590గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,730గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,540గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,680గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,540గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 దిగొచ్చి.. రూ. 85,400కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 85,500గా ఉండేది.

Silver price today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 88,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 85,400.. బెంగళూరులో రూ. 85,900గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 10 తగ్గి.. రూ. 25,000కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,010గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,000గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana