Teen kills friend fo ex girlfriend : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన మాజీ ప్రియురాలిని స్నేహితుడు డేటింగ్ చేస్తున్నాడని ఓ వ్యక్తి అనుమానించాడు. సిగరెట్ తాగుదామని పిలిచి.. ఆ 16ఏళ్ల స్నేహితుడిని కిరాతకంగా పొడిచి, పొడిచి చంపేశాడు!
ఇదీ జరిగింది..
మహారాష్ట్రలోని ఘట్కోపర్లో ఈ ఘటన జరిగింది. నిందితుడి పేరు రుషికేశ్ గౌరవ్. అతని వయస్సు 19ఏళ్లు. అతనికి ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. ఆమె ఒక మైనర్. ఇటీవలి కాలంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో.. ఘట్కోపర్ నుంచి థానేలోని దివా అనే ప్రాంతానికి వలస వెళ్లాడు రుషికేశ్. అప్పటి నుంచి.. వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగింది.
అదే సమయంలో.. తన 16ఏళ్ల స్నేహితుడు శ్రవణ్ సలావే.. తన గర్ల్‌ఫ్రెండ్‌ని డేట్ చేస్తున్నాడని అనుమానించాడు రుషికేశ్. ఆ అనుమాలను మరింత బలపరిచే విధంగా.. అతడిని ఓ ఫొటో కనిపించింది. శ్రవణ్, ఆ మైనర్ బాలిక కలిసి ఉన్న ఫొటో ఒకటి.. సోషల్ మీడియాలో చూశాడు రుషికేశ్. కోపంతో ఊగిపోయిన అతను.. 16ఏళ్ల స్నేహితుడు శ్రవణ్‌ని చంపేద్దామని ఫిక్స్ అయ్యాడు.
Mumbai crime news : 9వ తరగతి చదువుకుంటున్న శ్రవణ్‌ని సిగరెట్ తాదుగామని.. ఆదివారం సాయంత్రం శ్రవణ్‌ని ఘట్కోపర్కు పిలిచాడు రుషికేశ్. ఇదరు కలిసి సిగరెట్ తాగారు. ఆవెంటనే.. శ్రవణ్‌పై ఐరన్ రాడ్‌తో అనేకమార్లు దాడి చేశాడు రుషికేశ్. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
రక్తపు మడుగులో పడి ఉన్న శ్రవణ్‌ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి పరుగులు తీసిన పోలీసులు.. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రవణ్ కళ్లు, ఛాతి, కుడి భుజం, మెడ, చేతులపై భారీ గాయాలు ఉన్నాయి.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగారు. బాధితుడి పేరు శ్రవణ్ అని, అతను సంజయ్ గాంధీ నగర్లో నివాసముంటాడని తెలుసుకున్నారు.
Man kills friend : “బాలుడి వివరాలను సేకరించాము. అతని తండ్రి ఓ గ్యాస్ కంపెనీలో మేనేజర్. తల్లి గృహిణి. అతనికి 23ఏళ్ల అక్కడ ఉంది. ఆమెకు పెళ్లైంది. 20ఏళ్ల అన్న కూడా ఉన్నాడు. మేము వెంటనే దర్యాప్తు చేపట్టాము. స్థానిక సీసీటీవీ కెమెరాలను పరిశీలించాము. ఆరోజు శ్రవణ్ ఎవరెవరిని కలుసుకున్నాడో చూశాము. రుషికేశ్ అని వ్యక్తిపై అనుమానాలు పెరిగాయి. అతడిని కలిసేందుకు.. రుషికేశ్ ఇంటికి వెళ్లాము. కానీ అతను అక్కడ దొరకలేదు,” అని పోలీసులు చెప్పారు.
స్నేహితుడిని చంపేసిన తర్వాత రుషికేశ్.. మరో స్నేహితుడి ఇంట్లో తలదాచుకుంటున్నట్టు పోలీసులకు తెలిసింది. చివరికి.. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చదువుకోవాల్సిన వయస్సులో యువకులు ఈ తరహా నేరాలకు పాల్పడుతుండటం చూసి అందరు షాక్‌కు గురవుతున్నారు.