Wednesday, October 30, 2024

Crime news : మాజీ ప్రియురాలిని డేటింగ్​ చేస్తున్నాడని.. 16ఏళ్ల స్నేహితుడిని చంపిన యువకుడు!

Teen kills friend fo ex girlfriend : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన మాజీ ప్రియురాలిని స్నేహితుడు డేటింగ్​ చేస్తున్నాడని ఓ వ్యక్తి అనుమానించాడు. సిగరెట్​ తాగుదామని పిలిచి.. ఆ 16ఏళ్ల స్నేహితుడిని కిరాతకంగా పొడిచి, పొడిచి చంపేశాడు!

ఇదీ జరిగింది..

మహారాష్ట్రలోని ఘట్కోపర్​లో ఈ ఘటన జరిగింది. నిందితుడి పేరు రుషికేశ్​ గౌరవ్​. అతని వయస్సు 19ఏళ్లు. అతనికి ఒక గర్ల్​ఫ్రెండ్​ ఉండేది. ఆమె ఒక మైనర్​. ఇటీవలి కాలంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో.. ఘట్కోపర్​ నుంచి థానేలోని దివా అనే ప్రాంతానికి వలస వెళ్లాడు రుషికేశ్​. అప్పటి నుంచి.. వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగింది.

అదే సమయంలో.. తన 16ఏళ్ల స్నేహితుడు శ్రవణ్​ సలావే.. తన గర్ల్​ఫ్రెండ్​ని డేట్​ చేస్తున్నాడని అనుమానించాడు రుషికేశ్​. ఆ అనుమాలను మరింత బలపరిచే విధంగా.. అతడిని ఓ ఫొటో కనిపించింది. శ్రవణ్​, ఆ మైనర్​ బాలిక కలిసి ఉన్న ఫొటో ఒకటి.. సోషల్​ మీడియాలో చూశాడు రుషికేశ్​. కోపంతో ఊగిపోయిన అతను.. 16ఏళ్ల స్నేహితుడు శ్రవణ్​ని చంపేద్దామని ఫిక్స్​ అయ్యాడు.

Mumbai crime news : 9వ తరగతి చదువుకుంటున్న శ్రవణ్​ని సిగరెట్​ తాదుగామని.. ఆదివారం సాయంత్రం శ్రవణ్​ని ఘట్కోపర్​కు పిలిచాడు రుషికేశ్​. ఇదరు కలిసి సిగరెట్​ తాగారు. ఆవెంటనే.. శ్రవణ్​పై ఐరన్​ రాడ్​తో అనేకమార్లు దాడి చేశాడు రుషికేశ్​. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

రక్తపు మడుగులో పడి ఉన్న శ్రవణ్​ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి పరుగులు తీసిన పోలీసులు.. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రవణ్​ కళ్లు, ఛాతి, కుడి భుజం, మెడ, చేతులపై భారీ గాయాలు ఉన్నాయి.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగారు. బాధితుడి పేరు శ్రవణ్​ అని, అతను సంజయ్​ గాంధీ నగర్​లో నివాసముంటాడని తెలుసుకున్నారు.

Man kills friend : “బాలుడి వివరాలను సేకరించాము. అతని తండ్రి ఓ గ్యాస్​ కంపెనీలో మేనేజర్​. తల్లి గృహిణి. అతనికి 23ఏళ్ల అక్కడ ఉంది. ఆమెకు పెళ్లైంది. 20ఏళ్ల అన్న కూడా ఉన్నాడు. మేము వెంటనే దర్యాప్తు చేపట్టాము. స్థానిక సీసీటీవీ కెమెరాలను పరిశీలించాము. ఆరోజు శ్రవణ్​ ఎవరెవరిని కలుసుకున్నాడో చూశాము. రుషికేశ్​ అని వ్యక్తిపై అనుమానాలు పెరిగాయి. అతడిని కలిసేందుకు.. రుషికేశ్​ ఇంటికి వెళ్లాము. కానీ అతను అక్కడ దొరకలేదు,” అని పోలీసులు చెప్పారు.

స్నేహితుడిని చంపేసిన తర్వాత రుషికేశ్​.. మరో స్నేహితుడి ఇంట్లో తలదాచుకుంటున్నట్టు పోలీసులకు తెలిసింది. చివరికి.. అతడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చదువుకోవాల్సిన వయస్సులో యువకులు ఈ తరహా నేరాలకు పాల్పడుతుండటం చూసి అందరు షాక్​కు గురవుతున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana