Home ఎంటర్టైన్మెంట్ Zombie movies on OTTs: జాంబీ మూవీస్ అంటే ఇష్టమా.. అయితే ఓటీటీల్లోని ఈ టాప్...

Zombie movies on OTTs: జాంబీ మూవీస్ అంటే ఇష్టమా.. అయితే ఓటీటీల్లోని ఈ టాప్ జాంబీ మూవీస్ మిస్ కావద్దు

0

Zombie movies on OTTs: హారర్ జానర్ లో జాంబీ సినిమాలు చాలా ప్రత్యేకం. మనల్ని ఓ డిఫరెంట్ వరల్డ్ లోకి ఈ మూవీస్ తీసుకెళ్తాయి. తెలుగులోనూ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ జాంబి రెడ్డి పేరుతో ఓ సినిమా తీశాడు. మరి అలాంటి జాంబీ మూవీస్ ఇష్టపడే వారికోసం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలాంటి ఓటీటీల్లో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటి? ఏ ఓటీటీలో చూడాలనే వివరాలు ఇక్కడ చూడండి.

ఓటీటీల్లోని జాంబీ మూవీస్

జాంబి రెడ్డి – జీ5 ఓటీటీ

హనుమాన్ మూవీతో ఈ మధ్యే హిట్ కొట్టిన తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో 2020లో వచ్చిన మూవీ జాంబి రెడ్డి. తెలుగులో ఈ జానర్ లో వచ్చిన తొలి సినిమా ఇదే. ఓ స్నేహితుడి పెళ్లికి వెళ్లి జాంబీల బారిన పడే స్నేహితుల చుట్టూ తిరిగే కథే ఈ జాంబి రెడ్డి. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించిన ఈ సినిమా జీ5 (Zee5) ఓటీటీలో ఉంది.

జాంబీల్యాండ్ – నెట్‌ఫ్లిక్స్

జాంబీల్యాండ్ ఓ హారర్ కామెడీ మూవీ. ఊహించని వ్యాధి మనుషలందరినీ జాంబీలుగా మార్చేస్తూ ఉంటుంది. వాటి నుంచి నలుగురు మాత్రం తప్పించుకుని వెళ్తారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

ట్రెయిన్ టు బూసాన్ – నెట్‌ఫ్లిక్స్

ఇదొక కొరియన్ హారర్ మూవీ. ట్రెయిన్ టు బూసాన్ కచ్చితంగా చూడాల్సిన జాంబీ మూవీగా చెప్పొచ్చు. సియోల్ నుంచి బూసాన్ వెళ్తున్న రైల్లో జాంబీ అటాక్ నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు చేసే ప్రయత్నమే ఈ మూవీ. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూడొచ్చు.

వరల్డ్ వార్ జెడ్ – ప్రైమ్ వీడియో

మనుషులను జాంబీలుగా మార్చే వైరస్ చుట్టూ తిరిగే కథే ఈ వరల్డ్ వార్ జెడ్. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. ఆ వైరస్ ను అంతమొందించి, ప్రపంచ మానవాళిని కాపాడే పాత్రలో అతడు నటించాడు.

గో గోవా గాన్ -ప్రైమ్ వీడియో

గో గోవా గాన్ ఓ బాలీవుడ్ మూవీ. 2013లో వచ్చింది. గోవాలో ఎవరికీ తెలియని ఓ దీవిలో రేవ్ పార్టీకి వెళ్లిన ముగ్గురు స్నేహితులు జాంబీల బారిన పడతారు. అక్కడి నుంచి వాళ్లు ఎలా తప్పించుకుంటారన్నదే ఈ సినిమా కథ.

మిరుతన్ – జీ5 ఓటీటీ

మిరుతన్ ఓ తమిళ సినిమా. 2016లో రిలీజైంది. ఓ కుక్క ఓ సెక్యూరిటీ గార్డ్ ను కరవడం, అది కాస్తా అతన్ని జాంబీగా మార్చేయడం.. దీని నుంచి మిగతా వాళ్లను కాపాడటానికి ఓ పోలీస్ అధికారి చేసే ప్రయత్నమే ఈ మిరుతన్. ఈ సినిమా జీ5 ఓటీటీలో ఉంది.

28 డేస్ లేటర్ – ప్రైమ్ వీడియో

28 డేస్ లేటర్ 2002లో వచ్చిన సినిమా. ఈ మూవీని ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడొచ్చు. ఓ సీక్రెట్ ల్యాబ్ నుంచి వైరస్ మనుషులను జాంబీలుగా మార్చే క్రమంలో జరిగిన పరిణామాలే ఈ 28 డేస్ లేటర్ మూవీ. కోమాలోకి వెళ్లి హాస్పిటల్లో ఉన్న వ్యక్తి నెల రోజుల తర్వాత కోలుకొని వచ్చి చూస్తే అప్పటికే ప్రపంచమంతా జాంబీల బారిన పడినట్లుగా ఈ మూవీలో చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.

Exit mobile version