Virat Kohli out today match video : ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఔటన తీరు ఇప్పుడు వార్తలకెక్కింది. నడుము ఎత్తు ఫుల్ టాస్‌గా కనిపించిన బంతికి ఆర్సీబీ ఓపెనర్ ఔటవ్వడం, దానిని నో బాల్‌గా ప్రకటించకపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ రివ్యూ తీసుకున్నా.. అది అతనికి వ్యతిరేకంగా వచ్చింది. ఫలితంగా.. ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ హోల్డర్.. 7 బంతుల్లో 18 పరుగుల వద్ద ఔటయ్యాడు. అప్పటి నుంచి కోహ్లీ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. అంతేకాదు.. మ్యాచ్ మధ్యలో అంపైర్లతో కోహ్లీ గొడవపడటం కూడా వైరల్‌గా మారింది. ఫలితంగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడం జరిగింది.
కోహ్లీపై భారీ జరిమానా..
“ఏప్రిల్ 21, 2024న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1 బ్రీచ్ చేస్తే మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్,’ అని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.
Virat Kohli latest news : ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం కోహ్లీ లెవెల్ 1 అఫెన్స్కి పాల్పడ్డాడు. తనపై ఐపీఎల్ వేసిన జరిమానాను అంగీకరించాడు విరాట్ కోహ్లీ.
ఐపీఎల్ 2024లో ఆర్సీబీ దారుణ ప్రదర్శన..
Virat Kohli IPL 2024 : ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కష్టాలు కొనసాగుతున్నాయి. ఆదివారం.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కూడా విరాట్ కోహ్లీ టీమ్ ఓడిపోయింది. ఫలితంగా.. ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో 7సార్లు ఓటమి పాలైంది. ఇక ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసులో ఆర్సీబీ దాదాపు ఎగ్జిట్ ఇచ్చినట్టేనా? అని అడిగితే మాత్రం.. ఇంకా అవకాశం ఉందనే చెప్పుకోవాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.