Sunday, October 27, 2024

Virat Kohli : అంపైర్లతో గొడవ- విరాట్​ కోహ్లీకి భారీ జరిమానా..

Virat Kohli out today match video : ఐపీఎల్​ 2024లో భాగంగా ఆదివారం మాజీ చాంపియన్ కోల్​కతా నైట్​​రైడర్స్​తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు​ తలపడిన మ్యాచ్​లో విరాట్​ కోహ్లీ ఔటన తీరు ఇప్పుడు వార్తలకెక్కింది. నడుము ఎత్తు ఫుల్ టాస్​గా కనిపించిన బంతికి ఆర్సీబీ ఓపెనర్ ఔటవ్వడం, దానిని నో బాల్​గా ప్రకటించకపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ రివ్యూ తీసుకున్నా.. అది అతనికి వ్యతిరేకంగా వచ్చింది. ఫలితంగా.. ఐపీఎల్​ 2024 ఆరెంజ్​ క్యాప్​ హోల్డర్​.. 7 బంతుల్లో 18 పరుగుల వద్ద ఔటయ్యాడు. అప్పటి నుంచి కోహ్లీ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. అంతేకాదు.. మ్యాచ్​ మధ్యలో అంపైర్లతో కోహ్లీ గొడవపడటం కూడా వైరల్​గా మారింది. ఫలితంగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్​ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడం జరిగింది.

కోహ్లీపై భారీ జరిమానా..

“ఏప్రిల్ 21, 2024న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్​కతా నైట్ రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1 బ్రీచ్​ చేస్తే మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్​,’ అని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.

Virat Kohli latest news : ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం కోహ్లీ లెవెల్ 1 అఫెన్స్​కి పాల్పడ్డాడు. తనపై ఐపీఎల్​ వేసిన జరిమానాను అంగీకరించాడు విరాట్​ కోహ్లీ.

ఐపీఎల్​ 2024లో ఆర్సీబీ దారుణ ప్రదర్శన..

Virat Kohli IPL 2024 : ఐపీఎల్​ 2024లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు (ఆర్సీబీ) కష్టాలు కొనసాగుతున్నాయి. ఆదివారం.. కోల్​కతా నైట్​ రైడర్స్​తో జరిగిన ఉత్కంఠ పోరులో కూడా విరాట్​ కోహ్లీ టీమ్​ ఓడిపోయింది. ఫలితంగా.. ఈ ఐపీఎల్​ సీజన్​లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో 7సార్లు ఓటమి పాలైంది. ఇక ఐపీఎల్​ 2024 ప్లేఆఫ్స్​ రేసులో ఆర్సీబీ దాదాపు ఎగ్జిట్​ ఇచ్చినట్టేనా? అని అడిగితే మాత్రం.. ఇంకా అవకాశం ఉందనే చెప్పుకోవాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana