Thalaivar 171 Title: తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్.. భారీ యాక్షన్ చిత్రాలతో వరుసగా బ్లాక్బస్టర్లు కొట్టిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో చిత్రంపై హైప్ విపరీతంగా ఉంది. ఈ సినిమా(Thalaivar 171)పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. లోకేశ్ హైవోల్టేజ్ యాక్షన్ మూవీలో రజినీకాంత్‌ను ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా టైటిల్‌ను మూవీ టీమ్ ఖరారు చేసింది. రజినీ – లోకేశ్ మూవీ టైటిట్ టీజర్ నేడు (ఏప్రిల్ 22) రిలీజ్ చేసింది.
టైటిల్ ఇదే
రజినీకాంత్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో రానున్న ఈ చిత్రానికి ‘కూలీ’ (Coolie) టైటిల్ ఫిక్స్ అయింది. ఇంతకాలం ఈ ప్రాజెక్టును తలైవర్ 171గా పిలువగా.. ఇప్పుడు పేరు ఖరారైంది. కూలీ టైటిల్ రివీల్ చేస్తూ ఓ టీజర్ కూడా తీసుకొచ్చింది మూవీ టీమ్.
వింటేజ్ ఫీల్‌తో యాక్షన్ ఫీస్ట్‌గా టీజర్
పవర్ఫుల్ యాక్షన్, వింటేజ్ చిత్రాలను గుర్తుచేసేలా ‘కూలీ’ మూవీ టైటిల్ టీజర్ ఉంది. పోర్టులో అక్రమంగా బంగారు స్మగ్లింగ్ చేస్తున్న బంకర్లోకి రజినీకాంత్ ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత అక్కడున్న గ్యాంగ్‌ను రజినీ చితక్కొడతారు.
గోల్డ్ వాచ్‌లతో రజినీ చేసే ఫైట్ హైలైట్‌గా ఉంది. వింటేజ్ లుక్‌లో తలైవా అదరగొట్టారు. బంగారాన్ని హైలైట్ చేస్తూ.. మిగిలినదంతా బ్లాక్ అండ్ వైట్‌లో ఉండడం ఈ టీజర్లో మరో ఇంట్రెస్టింగ్ విషయంగా ఉంది. గోల్డ్ బిస్కెట్లు, డబ్బుపై పడుకొని రజినీ విజిల్ వేసే షాట్ వారెవా అనిపించింది.
రంగా (1982) సినిమాలోని ఫేమస్ డైలాగ్‌ను ఈ కూలీ టీజర్లోనూ చెప్పారు రజినీ. తంగా మగన్ (1983) సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ను మిక్స్ చేసి.. ఈ టీజర్‌కు పవర్ఫుల్ బీజీఎం ఇచ్చారు అనిరుధ్ రవిచందర్.
కూలి టీజర్లో రజినీకాంత్ లుక్ అదిరిపోయింది. యాక్షన్ వింటేజ్ తలైవాను గుర్తు చేస్తోంది. ఇక, యాక్షన్, టేకింగ్‌లో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ మరోసారి తన మార్క్ చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టారు.