KKR vs RCB IPL 2024 : ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 48 పరుగులు; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50) హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో రమణ్‌దీప్ సింగ్ (9 బంతుల్లో 24 పరుగులు నాటౌట్) దూకుడుగా ఆడాడు. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్, కామెరూన్ గ్రీన్ తలా రెండు వికెట్లు తీశారు. మహమ్మద్ సిరాజ్, లూకీ ఫెర్గ్యూసన్ చెరో వికెట్ తీసుకున్నారు.