దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఏపీలో జరుగుతున్న అక్రమాలపై గుంటూరు రూరల్ మండలం స్వర్ణ భారతి నగర్లోని కృష్ణతులసి నగర్ డి బ్లాక్ కు చెందిన కోపూరి లక్ష్మి దేశ రాజధానిలో ఆదివారం ‘ఏకలవ్య’ తరహాలో నిరసన చేపట్టారు. మాజీ హోంమంత్రి సుచరిత అనుచరుల అక్రమాలపై ఏకరువు పెచట్టారు. గంజాయి, ఫోర్జరీతో భూకబ్జాలు, ఎన్నో ఘోరాలని ఆందోళన చెందారు.