Friday, January 24, 2025

Crime news : 8వ తరగతి విద్యార్థిని అపహరణ.. రెండు రోజుల పాటు గ్యాంగ్​ రేప్​!

Girl gang raped in Bihar : బిహార్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 8వ తరగతి విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఆ బాలికను అపహరించిన తర్వాత.. నలుగురు ఆమెను రెండు రోజుల పాటు గ్యాంగ్​ రేప్​ చేశారు!

ఇదీ జరిగింది..

బిహార్​ ఖాప్​మిశ్రౌలి అనే గ్రామంలో జరిగింది ఈ ఘటన. సంబంధిత బాలిక వయస్సు 12ఏళ్లు. ఏప్రిల్​ 18 రాత్రి 9 గంటల ప్రాంతంలో.. టాయిలెట్​కు వెళ్లేందుకు ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో.. నలుగురు ఆమెను కిడ్నాప్​ చేశాడు. బాలికను నలుగురు అపహరించారు. వేరే చోటకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

బాలిక అరవడం మొదలుపెట్టగా.. ఆమెను తీవ్రంగా కొట్టారు. చెట్టుకు కట్టేసి దాడి చేశారు. ఇలా రెండు రోజుల పాటు.. సంబంధిత బాలిక చిత్రహింసలకు గురైంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, ఎవరికైనా చెబితే.. చంపేస్తామని నిందితులు హెచ్చరించారు.

Bihar crime news : శనివారం అర్ధరాత్రి- ఆదివారం తెల్లవారుజామున ప్రాంతంలో.. వారి చెర నుంచి ఎలాగో అలా బయపడిన ఆ బాలిక.. ఇంటికి పరుగులు తీసింది. ఇంటికి వెళ్లి, తన తల్లిదండ్రులకు జరిగినది వివరించింది.

ఆదివారం ఉదయం.. ఆ బాలిక స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను కుటుంబసభ్యులు వెంటనే ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికకు చికిత్స ఇస్తూనే.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు హాస్పిటల్​ సిబ్బంది. హాస్పిటల్​కు వెళ్లిన పోలీసులు.. అసలేం జరిగిందో తెలుసుకున్నారు.

“నిందితుల పేర్లు.. మహమ్మద్​ నూర్​ అలామ్​, దాదన్​ యాదవ్​, వికాశ్​ కను, రింకు మిశ్రా. నా బిడ్డను వారందరు రేప్​ చేశారు. ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. మమ్మల్ని కూడా బెదిరించారు. కాంప్రమైజ్​ అవ్వాలని చెప్పారు,” అని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

8th class girl raped in Bihar : ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. నలుగురు నిందితుల్లో ఒకడైన రింకు మిశ్రాను అరెస్ట్​ చేశారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారని తెలుసుకుని.. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు.. రింకు మిశ్రాను విచారించిన పోలీసులు.. పలు కీలక వివరాలు తెలుసుకున్నట్టు సమాచారం. అదే సమయంలో.. రింకు మిశ్రా రక్తనమూనని కూడా సేకరించారు అధికారులు.

మరోవైపు.. బాలికకు ఆదివారం రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం ఉదయం.. బాలికను జిల్లా మెజిస్ట్రేట్​ వద్ద హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు.

Crime news latest : ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 8వ తరగతి విద్యార్థిని అపహరం, గ్యాంగ్​ రేప్​ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana