అనకాపల్లిలో బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని రమేష్ కలిశారు. మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో మిత్రుని గెలిపించాలని చిరంజీవి కోరారు. అంతే కాకుండా ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమిని గెలిపించాలనే ప్రజలకు చిరంజీవి విజ్ఞప్తి చేశారు. మరో వైపు ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది.