చివరి ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టినా..
బెంగళూరు గెలవాలంటే చివరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే, కోల్‍కతా పేసర్, ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ప్లేయర్ మిచెల్ స్టార్క్ వేసిన ఆ ఓవర్లో తొలి బంతికే బెంగళూరు బ్యాటర్ కర్ణ్ శర్మ సిక్స్ బాదాడు. ఆ తర్వాత డాట్ బాల్ పడింది. అనంతరం తర్వాతి రెండు బంతులకు రెండు సిక్సర్లు కొట్టి అదరగొట్టాడు కర్ణ్ శర్మ. దీంతో చివరి రెండు బంతులకు ఆర్సీబీ మూడు రన్స్ చేయాల్సి వచ్చింది. గెలిచేలా కనిపించింది. ఆ సమయంలో కర్ణ్ శర్మ ఔటయ్యాడు. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి వచ్చింది. లాస్ట్ బాల్‍కు ఓ పరుగు పూర్తి చేసి.. రెండో పరుగు తీసే ప్రయత్నంలో లూకీ ఫెర్గ్యుసన్ రనౌట్ అయ్యాడు. దీంతో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.